CS Somesh Kumar News: సీఎస్ సోమేశ్ కుమార్‌పై చర్యలు ఉన్నట్టా లేనట్టా ?

Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 12:53 AM IST
  • రాజకీయ నాయకులతో సమానంగా ఆరోపణలు ఎఎదుర్కొంటున్న సీఎస్
  • తరచుగా వార్తల్లో నిలుస్తోన్న సీఎస్ సోమేశ్ కుమార్‌
  • సీఎస్ సోమేశ్ కుమార్ పనితీరుపై వివాదాలు
  • సీఎస్ సోమేశ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటారా అనే సందేహాలు
CS Somesh Kumar News: సీఎస్ సోమేశ్ కుమార్‌పై చర్యలు ఉన్నట్టా లేనట్టా ?

Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. గత కొంత కాలంగా ఏదో ఒక అంశం తెరమీదకు రావడం... దాన్ని సామాన్యులు మొదలు రాజకీయ పార్టీల నేతలు సైతం చర్చించుకునే స్థాయికి వెళ్లాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాకా  ఆయన కూడా తరచూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పదవిలో కొనసాగిన ఆయన... తెలంగాణ ఏర్పడ్డాకా 2017లో ఏపీకి అలాట్ అయ్యారు కానీ ఆ తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. సీఎం కేసీఆర్ చొరవతో ఇక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్‌పై 2017 నాటి డీఓపీటీ కేసు కూడా నడుస్తున్నప్పటికీ ఇంకా జడ్జిమెంట్ రాలేదు. 

సీఎస్ సోమేశ్ కుమార్‌పై ఆరోపణలు..
ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలన విధానంలో తోటి ఐఏఎస్ అధికారులను లెక్క చేయరనే వాదనలున్నాయి. వాటితో పాటు ధరణి పోర్టల్ నిర్మాణంలో తలెత్తుతోన్న లోపాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దాంతోపాటు వీఆర్ఏ పే స్కేల్ ఫైల్ ముందుకు కదపకుండా తనవద్దే అట్టిపెట్టుకున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఆయన పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 2017లో సోమేశ్ కుమార్‌పై నమోదైన కేసుపై క్యాట్ విచారణ జరుగుతున్న తరుణంలో ఎలాంటి తీర్పు వెలువడనుందనే ఉత్కంఠ రాజకీయ నేతల్లో నెలకొంది. 

సీఎస్ సోమేష్ కుమార్ పనితీరుపై వివాదాలు..
ఇదిలావుంటే, తరచుగా సీఎస్ సోమేష్ కుమార్ పనితీరుపై వివాదాలు తలెత్తుతున్న తరుణంలో ప్రభుత్వమే ఆయన్ని తప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. దాంతో మరోసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. వాటితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారులకు ప్రయార్టీ ఇస్తున్నారనే దానిపై కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం గుర్రుగా ఉన్నారు. ఈ అసంతృప్తి, ఆరోపణలు కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఆయన్ని కలిసేందుకు ప్రయత్నిస్తే.. కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.  

యాసంగిలో వరిధాన్యం కొనుగోలుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష..
మరోవైపు ఇవన్నీ ఓవైపు మాత్రమే అన్నట్టు తనపై వస్తున్న పుకార్లు షికార్లు కొడుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు సీఎస్ సోమేశ్ కుమార్. తాజాగా ఆయన యాసంగిలో వరిధాన్యం కొనుగోలుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా అధికారులకు దిశా నిర్దేశ్యం చేసినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ముందుకు రావడం లేదన్న విపక్షాల విమర్శలపై అధికారులు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. ఇదంతా చూస్తోంటే ఇంతకీ బయట ప్రచారం జరుగుతున్నట్టుగా సీఎస్  సోమేశ్ కుమార్‌పై (CS Somesh Kumar) బదిలీ వేటు ఉంటుందా ? లేక ఎప్పటిలాగే కొనసాగింపేనా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

Also read : BJP public meeting at Mahaboobnagar: పాలమూరులో బీజేపీ బహిరంగ సభ, జేపీ నడ్డా సంచలన కామెంట్లు

Also read : Hyderabad Double Murder Case: హైదరాబాద్ జంట హత్యల కేసులో సంచలన నిజాలు, భర్త అనుమతితో వెళ్లింది..భర్త చేతిలో హతమైంది.

Also read : Rahul Gandhi Tour in Telangana : తెలంగాణకు రాహుల్... పర్మిషన్లు రాక కాంగ్రెస్ పరేషాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News