అధికారులను ముప్పతిప్పలు పెట్టిన కరోనా బాధితురాలు...

దేశవ్యాప్తంగా కరోనాతో అతలాకుతలమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న 

Last Updated : Apr 18, 2020, 08:39 PM IST
అధికారులను ముప్పతిప్పలు పెట్టిన కరోనా బాధితురాలు...

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనాతో అతలాకుతలమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించేదుకు ఇప్పటికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌ముఖులు, ఎన్నో రకాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

Read Also: Also read : వధూ వరులపై కేసు

ఈ విపత్కర పరిస్థితుల్లో సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతంలో వైర‌స్ పాజ‌టివ్‌గా తేలిన యువ‌తి అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. స్నేహా అనే యువ‌తికి వైర‌స్ పాజిటివ్‌గా తేల‌టంతో ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించారు. అయితే, ఆమె ఆస్ప‌త్రి నుంచి త‌ప్పించుకుంద‌ని, సికింద్రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతుందని తెలిసి అధికారులు, సిబ్బంది గాలింపు చేప‌ట్టారు. ప్ర‌తి ఇంటిని ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఆ యువ‌తి ఆచూకీ కోసం ప్రయత్నించగా చివ‌ర‌కు రాత్రి ఇంటికి వ‌చ్చిన ఆమెను పోలీసుల ఆధ్వ‌ర్యంలో తిరిగి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Also Read: Read Also: తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు లింకేంటి..?

కాగా బాధితురాలితో పాటు కుటుంబ స‌భ్యులంద‌రినీ క్వారంటైన్‌కు తరలించామని, వారి నమూనాలను తీసుకొని పరీక్షలు చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.  మరోవైపు త‌మ కాల‌నీలో ఉంటున్న యువ‌తికి క‌రోనా అని తేల‌టంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News