Jr NTR on Politics : జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీతో పలకరించాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ నేపథ్యంలో మూడు రోజుల్లో రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కలెక్ట్ చేసి హీరోగా ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. మాన్ ఆఫ్ మాసెస్ గా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటతున్నాడు. ఇక 2009 ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేసి సంచలనం రేపారు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పాలిటిక్స్ ను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో సినిమాలపైనే తన దృష్టిని కేంద్రీ కరించాడు.
దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నారని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్నారు. అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేశానన్నారు. ఓట్ల సంగతి పక్కన పెడితే.. తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు తారక్. ఎన్టీఆర్ వ్యాఖ్యలతో ఇప్పట్లో రాజకీయాల్లో వచ్చే ఉద్దేశ్యం తనకు లేనట్టు అర్ధమవుతోంది.
దేవర మూవీ విషయానికొస్తే.. ఈ మూవీ హిందీ బెల్ట్ లో కూడా ఇరగదీస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు రూ. 50 కోట్ల వరకు నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు ఇదే తొలి ప్యాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, కన్నడలో ఈ మూవీ ఇరగదీస్తోంది. తమిళం, మలయాళంలో పుంజుకుంటుంది. మొత్తంతా 'దేవర' సక్సెస్ తో రాజమౌళి తో సినిమా చేసిన హీరో ఆ తర్వాత ఫ్లాప్ అందుకుంటాడనే సెంటిమెంట్ కు ఎన్టీఆర్ బ్రేకులు వేసాడనే చెప్పాలి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.