Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..

Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం  కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2024, 01:36 PM IST
  • మాజీ సీఎం కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి..
  • తమ జోలికి వస్తే బాగుండదంటూ వ్యాఖ్యలు..
Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..

Congress Party Minister Komatireddy venkat Reddy Sensational comments on Former cm kcr: కాంగ్రెస్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం కూలిపోతుందంటూ మరోమారు వ్యాఖ్యలు చేస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను పునాదులతో సహాలేపేస్తామంటూ కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఇదిలా ఉండగా మాజీ  సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.రుణ మాఫీపై సీఎం రేవంత్  ఒక మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రుణ మాఫీ మొత్తం ఒకేసారి ఇస్తామంటారు.. ఇక మంత్రి కోమటి రెడ్డి రుణమాఫీలను దశలవారీగా  ఇస్తామంటారు... వాళ్లలో వాళ్లకే ఒక క్లారిటీ లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Read More:Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

లోక్ సభ ఎన్నికలలో... కాంగ్రెస్‌కు 2 సీట్ల కంటే ఎక్కువ రావు అని సర్వే రిపోర్ట్లు వచ్చాయి.. అన్ని జిల్లాల్లో రైతులు తిరగబడుతున్నారు, రేవంత్ రెడ్డి భయం చూస్తే ఈ ప్రభుత్వం యేడాది కూడా ఉండేటట్లు కన్పించడంలేదంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, 9 ఏండ్లల్లో కనురెప్ప కొట్టేంత సేపైనా కరెంటు పోయిందా?.. అని గుర్తు చేశారు.కరెంటు పోకుండా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కేసీఆర్ అన్నారు. అదే విధంగా సెక్రెటెరియట్ దగ్గర.. మహనీయుడు అంబేద్కర్ భారీ విగ్రహం పెట్టిన తర్వాత వచ్చిన మొదటి జయంతి ఇది. అలాంటిది విగ్రహానికి ఒక పువ్వు పెట్టలేదు, ఒక పూలమాల వెయ్యలేదు, అంజలి ఘటించలేదని కాంగ్రెస్ తీరుపై విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు అంబేద్కర్ విగ్రహాం చూడటానికి వస్తే కనీసం మంచి నీళ్లు పెట్టకుండా, విగ్రహం దగ్గరికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారన్నారు.

మేము కట్టిన విగ్రహం దగ్గరికి వెళ్లనప్పుడు, మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు? మేము కట్టిన యాదగిరిగుట్ట దగ్గరకు ఎందుకు పోయి మొక్కుకున్నారు? మేము కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎందుకుంటున్నారని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఇక సీఎం రేవంత్ కు ఉద్దేషించి.. కూర్చుంటే లేవ చాత కాదు కానీ.. తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడంట. డిసెంబర్ 9 తారీకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అన్నడు, డిసెంబర్ 9 పోయింది.. మళ్లీ ఆగస్ట్ 15 కు వేస్తాం అంటుండని కేసీఆర్ విమర్శించారు.

Read More: Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?

రాజకీయాల్లో అప్పుడప్పుడు గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీపుట్ గాళ్లకి కూడా అధికారం వస్తుందని సీఎం రేవంత్ ను ఉద్దేషించి గులాబీ బాస్ కేసీఆర్ సెటైర్ వేశాడు. ఇదే సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తె పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అవుద్దని అన్నారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్ని అన్నారు. బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని.. వడ్లు కొనమంటే నూకలు బుక్కండి అని తెలంగాణను అవమానపరిచారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారంటీలైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అవే గ్యారంటీలు గడ్డపారలై కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతున్నాయని గులాబీ నేత హరీష్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News