Ganja Cultivation In Telangana: తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR Latest News) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి పెంపకం, వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించాలని పోలీసులను ఆదేశించారు. గంజాయి వినియోగంపైనే కాకుండా జూదం, అక్రమ మద్యం రవాణాను అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి.. వాటి నిర్మూలనకు పాటు పడిన అధికారులకు నగదు లేదా ప్రమోషన్లు రూపంలో లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
"ఎన్నో పోరాటాల తర్వాత మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుంచడం సహా రాష్ట్రంలో పోలీసుల సహకారం ద్వారా అత్యుత్తమ శాంతిభద్రతలను నెలకొల్ప గలిగాం. ఈ క్రమంలో తీవ్రవాదాన్ని నియంత్రించాం. దీంతో మన రాష్ట్రంపై ఇతర రాష్ట్రాల వారికి గౌరవం పెరిగింది. కానీ, ఇప్పటికీ తెలంగాణలో నిషేధిత పదార్థాలు (గంజాయి) లభించడం దురదుష్టకరం. వీటిని నిర్మూలించకపోతే అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పోలీసు, ఎక్సైజ్ అధికారులు వీటి నిర్మూలనకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అమాయక యువత వాటి బారిన పడుతున్నారు. మరెంతో మంది వాటి బారిన పడి బలికాక ముందే అధికారులు చర్యలు చేపట్టాలి" అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
రాష్ట్రంలో(Telangana News) గంజాయి నిర్మూలన కోసం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఆయన చెప్పారు. విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా ఉంచాలని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. నేరగాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు.
ప్రజల్లో అవగాహన..
గంజాయి వినియోగం ఎంత ప్రమాదకరమైనదో(Charas Drug Effects) విద్యార్థి దశ నుంచే తెలియజేసేలా చేయాలని సీఎం కేసీఆర్(KCR Review Meeting Updates) అభిప్రాయపడ్డారు. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, మెసేజ్ ఓరియెంటెడ్ ఆడియోలు, వీడియోల ద్వారా గంజాయి వల్ల ఏర్పడే అనర్థాలను ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.
Also Read: అమరులైన పోలీసుల సేవలు మరవం - సీఎం కేసీఆర్
Also Read: 2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి