Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్ష చేపట్టారు.
CM KCR Review Meeting: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Ganja Cultivation In Telangana: తెలంగాణలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(KCR Review Meeting Updates) పోలీసు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతోందన్న నివేదికల వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్ర కొత్త సచివాలయం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే మీడియాలో వైరల్ అవుతున్న మోడల్ కు ఆమోదం లభిస్తుందా లేదా కొత్తది సిద్ధమవతుందా? కొత్త సచివాలయం ( New Secretariat ) డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష( KCR Review ) నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.