గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ నియామకపత్రాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ భోజనం కూడా చేశారు.
ఇండో చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో ఇండోచైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో హైదరాబాద్ కు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. దాంతో అతని భార్య సంతోషికి ఇంటిస్థలం, 5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సంతోష్ బాబు భార్య సంతోషికు డిప్యూటీ కలెక్టర్ గా నియామకపత్రాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు.
అనంతరం సంతోషి కుటుంబసభ్యులు 20 మందితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పరిసరాల్లోనే ఆమెకు పోస్టింగ్ కల్పించాలని కేసీఆర్ సూచించారు. Also read: Telangana: ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం