K. Himanshu: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) మనవడు, మంత్రి కేటీఆర్‌ (KTR) కుమారుడు హిమాన్షు (K. Himanshu) కి గాయాలైనట్లు తెలిసింది. హిమాన్షు కాలికి తీవ్రంగా ఫ్రాక్చర్‌ అయినట్లు సమాచారం.

Last Updated : Oct 1, 2020, 12:24 PM IST
K. Himanshu: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు..!

Telangana CM KCR grandson and KTR son himanshu injured: హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) మనవడు, మంత్రి కేటీఆర్‌ (KTR) కుమారుడు హిమాన్షు (K. Himanshu) కి గాయాలైనట్లు తెలిసింది. హిమాన్షు కాలికి తీవ్రంగా ఫ్రాక్చర్‌ అయినట్లు సమాచారం. అయితే తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును చికిత్స కోసం బుధవారం రాత్రి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద (Yashoda) ఆసుపత్రిలో చేర్పించారు. నొప్పి కారణంగా హిమాన్షు నిలబడలేని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. యశోద ఆసుపత్రి వైద్యులు హిమాన్షుకి సీటీ స్కాన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. తుంటి ప్రాంతంలో, మోకాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలిసింది. అయితే కుమారుడికి గాయాలు కావడంతో.. మంత్రి కేటీఆర్ దంపతులు రాత్రంతా ఆసుపత్రిలోనే ఉన్నారని తెలిసింది. ఇదిలాఉంటే.. హిమాన్షు ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also read: Balrampur Gang Rape: యూపీలో మరో హత్రాస్.. మృగాళ్ల వేటకు మరో యువతి బలి

హిమాన్షు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎవరికైనా ఆపద వస్తే స్పందిస్తూ ఆర్థిక సాయం సైతం చేస్తున్నారు. వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక సాయం లాంటివి చేస్తూ... తాత, తండ్రి బాటలో నడుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిమాన్షుకి గాయాలయ్యాయంటూ టీవీలో వార్త కథనాలు ప్రసారమవుతుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు, హిమాన్షు ఫాలోవర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.   Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

Trending News