TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు ( TSRTC buses ) గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ( TSRTC buses exepmted from curfew ) ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) స్పష్టంచేశారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చే బస్సులు జేబిఎస్‌తో పాటు ( JBS ), ఇమ్లీవన్‌ వరకు ( MGBS ) వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Last Updated : May 28, 2020, 06:55 AM IST
TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు ( TSRTC buses ) గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ( TSRTC buses exepmted from curfew ) ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) స్పష్టంచేశారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చే బస్సులు జేబిఎస్‌తో పాటు ( JBS ), ఇమ్లీవన్‌ వరకు ( MGBS ) వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో బుధవారం టిఎస్ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడి యాదగిరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తర్వాతి పరిస్థితిని ముఖ్యమంత్రి వివరించారు. ( Telangana COVID-19 Updates : తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు )

" టిఎస్ఆర్టీసీ సమ్మె ( TSRTC strike ) సమయంలో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని.. ఆ నష్టాల నుంచి కోలుకుని సంస్థ ఓ గాడిన పడుతుందనుకుంటున్న తరుణంలోనే కరోనావైరస్ దాడి చేయడం సంస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపించిందని వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈమధ్యే ఆర్టీసీ బస్సులు నడవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటున్న కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదని... ఫలితంగా బస్సులో ఆక్యుపెన్సీ రేటు బాగా తగ్గిందని ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీకి సాధారణంగా రావాల్సిన ఆదాయం రావడం లేదని వారు ముఖ్యమంత్రికి తెలిపారు.  ( TDP Mahanadu 2020 : టిడిపి మహానాడు 2020 ప్రారంభం.. మహానాడుకు ప్రత్యేక ఏర్పాట్లు )

భారీగా పడిపోయిన ఆదాయం..
రోజుకు 11 నుంచి 12 కోట్ల వరకు ఆదాయం రావాలి. ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్‌లో ఐతే ఆ కలెక్షన్ 15 కోట్ల వరకూ ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసికి రోజూ కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుందని వివరించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యపడదనే భయంతో ప్రయాణాలు చేయడం లేదు. ఎండాకాలం కావడం వల్ల ఉదయం, లేదంటే సాయంత్రం మాత్రమే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ రాత్రి పూట వారికి బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఎండాకాలంలో మధ్యాహ్నం వేళ బస్సుల్లో సాధారణంగానే ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు పగటి పూట మాత్రమే బస్సులు నడపడం వల్ల అటు ప్రజలకు, ఇటు ఆర్టీసీకి ప్రయోజనం లేకుండా పోయిందని ముఖ్యమంత్రికి తెలియజేశారు.
Lockdown 4.0 : తెలంగాణ లాక్‌డౌన్‌ 4.0 లో అనుమతి లేనివి )

ఆర్టీసీ అధికారుల వినతికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్..
ఆర్టీసి ఉన్నతాధికారుల అభిప్రాయాలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రజలకు, ఆర్టీసీకి మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందని అటు ఆర్టీసీ సంస్థ, ఇటు ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో తాజాగా 68 మందికి కరోనా.. మరో వ్యక్తి మృతి )

రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు: 
బస్టాండ్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుగా ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతి. 
బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి అనుమతి. వారిని పోలీసులు అడ్డుకోవడానికి వీల్లేదు. 
జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులన్నీ జేబిఎస్‌ వరకే వస్తున్నాయి. నేటి నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కి (ఇమ్లీబన్ బస్ స్టేషన్) కూడా బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 
హైదరాబాద్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇంకొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులకు అనుమతి లేదు. 
అంతర్రాష్ట్ర బస్సులకు కూడా ప్రస్తుతానికి ప్రవేశం లేదు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News