CM Kcr: బీజేపీపై ఇక యుద్ధమే..టీఆర్ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..!

CM Kcr: ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 16, 2022, 06:25 PM IST
  • ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు
  • టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
CM Kcr: బీజేపీపై ఇక యుద్ధమే..టీఆర్ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..!

CM Kcr: తెలంగాణ వాణిని పార్లమెంట్‌లో వినిపించాలని టీఆర్ఎస్‌ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను సభలో ప్రస్తావించాలన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రోత్సహించకుండా ద్వేష పూరితంగా వ్యవహరించడాన్ని సభలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. 

పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. కేంద్రంపై పోరాడాలన్నారు. ఇందుకు ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని ముందుకు వెళ్లాలన్నారు. బీజేపీపై పోరాడేందుకు పార్లమెంట్ ఉభయ సభలే సరైన వేదికలు అని సీఎం కేసీఆర్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని..అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పరిధిలోకి లోబడే తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాలను నడుపుతోందని ఎంపీల దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణిచివేస్తున్నారని ఆరోపించారు. పకడ్బందీగా తెలంగాణపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంపై పోరాడేందుకు అన్ని రకాల ప్రజాస్వామిక పద్దతులు అనుసరించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై కత్తి పెట్టారని ఫైర్ అయ్యారు. 

Also read:Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం..వాగులో కొట్టుకుపోయిన పడవ..!

Also read:Minister Ktr: రైతుల ఆదాయ వివరాలు చూపండి..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News