తెలంగాణ కేబినెట్‌లో నేతల వారీగా దక్కనున్న శాఖలు ఇవేనా ?

తెలంగాణ కేబినెట్‌లో ఎవరెవరికి, ఏయే శాఖలు కేటాయిస్తున్నారు ?

Last Updated : Feb 19, 2019, 12:18 AM IST
తెలంగాణ కేబినెట్‌లో నేతల వారీగా దక్కనున్న శాఖలు ఇవేనా ?

హైదరాబాద్: తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో మాత్రమే నడుస్తున్న తెలంగాణ సర్కార్ మంగళవారం కేబినెట్ విస్తరణకు సిద్ధమైంది. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మొత్తం 9 మందికి(కేసీఆర్ కాకుండా) ఈ విస్తరణలో అవకాశం లభించింది. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ వంటి నేతలకు తొలిసాకి కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కింది. 

క్రితంసారి కేబినెట్‌లో మంత్రిగా వున్న పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్, దాస్యం వినయ్ భాస్కర్‌లకు చీఫ్ విప్ పదవులు వరించాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురితో రెండోసారి కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కేబినెట్‌లో చోటు దక్కించుకున్న నేతలకు ఈ కింది విధంగా శాఖల కేటాయింపు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 
(1) కేసీఆర్‌- నీటి పారుదల, పంచాయతీ రాజ్ శాఖలు, 
(2) నిరంజన్ రెడ్డి- ఆర్థిక శాఖ, 
(3) జగదీశ్వర్ రెడ్డి- విద్యా, విద్యుత్ శాఖ, 
(4) ప్రశాంత్ రెడ్డి- వ్యవసాయం మార్కెటింగ్ శాఖలు, 
(5) మల్లా రెడ్డి- రవాణ శాఖ, 
(6) ఇంద్రకరణ్ రెడ్డి- వైద్యం, ఆరోగ్య శాఖలు, 
(7) తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పశు సంవర్థక శాఖ, 
(8) ఎర్రబెల్లి దయాకర్ రావుకు రోడ్లు భవనాల శాఖ, 
(9) శ్రీనివాస్ గౌడ్‌కు ఎక్సైజ్, సంక్షేమ శాఖ, 
(10) కొప్పుల ఈశ్వర్- పంచాయతీ రాజ్ శాఖ

అయితే, కేబినెట్‌లో బెర్తు దక్కించుకోవడంలోనైనా, శాఖల కేటాయింపులోనైనా చివరి నిమిషంలో మార్పుచేర్పులు జరిగి అనూహ్యంగా కొంతమంది నేతలు కీలక పదవులు దక్కించుకున్న సందర్భాలు గతంలో అనేకం వుండగా అదే చివరి నిమిషంలో అవకాశం కోల్పోవడమో లేక ప్రాధాన్యం లేని పోస్టులను సొంతం చేసుకున్న నేతలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జరగనున్న కేబినెట్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది.

Trending News