/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Bandi Sanjay Comments On CM KCR: సంతకాలు లేకుండా వివిధ పార్టీల నేతల, ముఖ్యమంత్రుల సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లుగా మీడియాకు విడుదల చేయడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో తన బిడ్ద పాత్రపై ఇంతవరకు నోరు మెదపని కేసీఆర్.. అదే కేసులో సిసోడియా అరెస్ట్ ను ఖండించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన బిడ్డను అరెస్ట్ చేయడం ఖాయమనే విషయం తెలియడంతో ఆమెను కాపాడుకునేందుకు ఈ కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

'నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపినట్లు మీడియా గ్రూపుల్లో లేఖలు పెట్టారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేశారని గగ్గోలు పెట్టారు. ఆ లేఖలో సంబంధిత నాయకుల సంతకాలే లేవు. వాళ్లకు అసలు ఈ లేఖ సంగతి తెలుసో లేదో.. కేసీఆర్‌కు ఇట్లాంటివి వెన్నతో పెట్టిన విద్య. కేసీఆరే తయారు చేశారు. లిక్కర్ దందాలో భాగస్వాములుగా ఉన్న ఆప్ పార్టీ, కేసీఆర్ పార్టీ తప్ప ఎవరూ దీనిపై స్పందించలేదు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి ఎన్ని దొంగ దందాలు చేసినా దర్యాప్తు చేయొద్దన్నదే వీళ్ల ఆలోచన. సిసోడియా నిజాయితీపరుడైతే ఆధారాల్లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేది కదా..? తరువాత కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారని తెలిసి తన బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు.

నీ బిడ్డపై ఆరోపణలొస్తే.. దీనిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఖండించలేదు. దీనిగురించి మాట్లాడని సీఎం.. సిసోడియా పేరుతో బిడ్డను కాపాడేందుకు కొత్త డ్రామాకు తెరలేపిండు. సంతకాలు లేకుండా లెటర్ రిలీజ్ చేయడంలో మీ ఆంతర్యమేమిటి..? సీఎంగా ఉంటూ ఇంత దిగజారుతారా..? గతంలో వరద సాయం సమయంలో నా పేరు మీద ఫోర్జరీ లెటర్ సృష్టించారు. దళిత బంధు విషయంలోనూ అలాగే చేశారు. కేసీఆర్ నువ్వు 9 మంది నాయకుల పేర్లతో లెటర్ రాశావే.. మరి నీ అవినీతి గురించి, మీ కుటుంబ అక్రమాల గురించి నేను పాదయాత్ర చేస్తుంటే లక్షలాది మంది ఫిర్యాదు చేశారు. మేం నీ అవినీతి, అక్రమాలపై త్వరలో కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి కలిసే అంశాన్ని పరిశీలిస్తున్నాం..' అని బండి సంజయ్ అన్నారు.
 
సిసోడియాను అరెస్ట్ చేస్తే ప్రపంచం ముందు పరువు పోయిందని చెప్పడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నానని చెప్పడం హాస్యాస్పదమని.. తప్పు చేసినోళ్లు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నదే మోదీ విధానమన్నారు.  కేసీఆర్ కావాలనే ప్రధానిని బదనాం చేయాలనుకుంటున్నారని.. కేసీఆర్‌కు కోర్టుల మీద నమ్మకం లేదని పేర్కొన్నారు. తెలంగాణ సీఎస్‌ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మందలించిందని గుర్తు చేసశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంతకాల్లేకుండా పత్రికలకు ఎట్లా రిలీజ్ చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతగా దిగజారడం బాధాకరమన్నారు. 

Also Read: Holi 2023: హోలీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ప్రకటన   

Also Read: Twitter: ట్విట్టర్‌లో కీలక మార్పు.. ట్వీట్ లిమిట్ పెంచుతూ ఎలాన్ మస్క్ ప్రకటన  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
telangana bjp president bandi sanjay sensational comments Over Cm kcr for writing pm modi
News Source: 
Home Title: 

Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్ 
 

Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్
Caption: 
Bandi Sanjay (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

లిక్కర్ కేసులో బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామా

సీఎంగా ఉంటూ ఇంత నీచ స్థాయికి దిగజారడం అవసరమా..?

దొంగ సంతకాలు కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య: బండి సంజయ్ 

Mobile Title: 
Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, March 6, 2023 - 20:55
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
43
Is Breaking News: 
No