BJP Leaders: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఈసందర్భంగా ఆమెకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగించడంతోపాటు భద్రత కల్పించాలని విన్నవించారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిపై విచారణ జరిపించాలన్నారు.
జనగామలో ప్రజాసంగ్రామ యాత్రపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయించాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయించాలన్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా బీజేపీ నాయకులు సంయమనం పాటించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
రెండో విడత యాత్రలో భాగంగా గద్వాల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్కు కంచుకోటలాంటి ప్రాంతాల్లో బీజేపీ యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని..ఏదో ఒక సాకుతో యాత్రను అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పలలో యాత్రపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటి ముందు ధర్నా చేసిన నేతలపై దాడులు జరగడం దారుణమని ఫైర్ అయ్యారు.
తప్పుడు కేసుల్లో 26 మంది బీజేపీ నేతలపై జ్యుడిషియల్ కస్టడీ విధించారని తెలిపారు. యాత్రపై దాడి చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 నుంచి 5 వేల మందిని సమీకరించినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు బీజేపీ నేతలు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రపై దాడి చేయాలని సీఎంవో నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు.
తక్షణమే పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా చూడాలని గవర్నర్‌కు బీజేపీ నేతలు విన్నవించారు. రాజ్‌భవన్‌కు బీజేపీ నేతల బృందం వెళ్లింది. గవర్నర్‌ను కలిసిన వారిలో కె.లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్, రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రామచంద్రారావు ఉన్నారు.
Also read:CM Jagan: వృద్ధి రేటులో టాప్‌లో ఉన్నాం..స్పందన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్..!
Also read:BJP Mla Raja Singh Live Updates: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి