తెలంగాణ సర్కార్ వైఖరేంటో అక్కడే అర్థమైంది: బీజేపి

ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt) న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావ్ డిమాండ్ చేశారు. సమ్మె(TSRTC strike) విరమించిన తర్వాత కూడా ఇంకా వారిని విధుల్లో చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా దెదిరింపు ధోరణికి పాల్పడటం అన్యాయమని అన్నారు. 

Last Updated : Nov 26, 2019, 12:28 AM IST
తెలంగాణ సర్కార్ వైఖరేంటో అక్కడే అర్థమైంది: బీజేపి

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt) న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. సమ్మె(TSRTC strike) విరమించిన తర్వాత కూడా ఇంకా వారిని విధుల్లో చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా దెదిరింపు ధోరణికి పాల్పడటం అన్యాయమని.. అక్రమం. ఇలాంటి బెదిరింపు ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఆయన తెలిపారు. తాము సమ్మెను ముగించినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అధికారికంగా ప్రకటించిన తరువాత కూడ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ విడుదల చేసిన ప్రకటన చూస్తే.. ఉద్యోగులను విధులకు అనుమతించవద్దని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్టుగా స్పష్టమవుతోందని.. ఇది పేద, మధ్యతరగతి ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్న ప్రతీకార వైఖరిలా కనిపిస్తుందని దుయ్యబట్టారు. 

Read also : కార్మికులకు ఆర్టీసీ ఎండి హెచ్చరిక!

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కృష్ణసాగర్.. కేసీఆర్ బలహీనమైన ఆర్టీసీ కార్మికులపై తన అధికార బలాన్ని ప్రయోగించి అదే తన విజయంగా ఆనందిస్తున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఓడించడంగా బీజేపీ భావిస్తుందని... ఆర్టీసీ సమ్మెను అణిచేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, అవలంభించిన వైఖరి, చెప్పిన అబద్దాలన్నీ కార్మికులపై ప్రభుత్వం వైఖరి ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు. Read also : ఆర్టీసీ సమ్మె: టీ సర్కార్ విజ్ఞప్తికి నో చెప్పిన హై కోర్టు

Trending News