Telangana Election Results 2023: ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, సీఎం అభ్యర్ధి ఎవరు

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడేకొద్దీ స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీలో ముందుకెళ్తోంది. అధికారం దాదాపుగా ఖాయమైన క్రమంలో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2023, 12:01 PM IST
Telangana Election Results 2023: ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, సీఎం అభ్యర్ధి ఎవరు

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇప్పటికే 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే అధికార బీఆర్ఎస్ కేవలం 42 స్థానాలకు పరిమితమైంది. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది. హంగ్ ఏర్పడుతుందనే వార్తలు సత్యదూరమయ్యాయి. అనూహ్య ఫలితాలు కన్పిస్తున్నాయి. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ రెండు స్థానాల్లో వెనుకంజలో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో ముందంజలోనూ, కామారెడ్డిలో వెనుకంజలో ఉన్నారు.  కాంగ్రెస్ అభ్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అటు కొడంగల్ ఇటు కామారెడ్డిలో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీలో ఉండటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే చర్చ ప్రారంభమైంది.

పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా దాదాపుగా 67 సభల్లో పాల్గొని ప్రచారం అంతా అంతా ఒక్కడై నిర్వహించిన రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే అనుభవం లేకపోవడం, డీఎన్ఏ కాంగ్రెస్ లేకపోవడంతో పాటు చంద్రబాబు మనిషిగా ముద్రపడటం మైనస్ కావచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డిని సీఎం చేయకపోతే ఈ మైనస్‌లే ప్రధాన కారణాలు కావచ్చు.

ఇక మరో వ్యక్తి భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రధానంగా రేసులో ఉన్న వ్యక్తి. ఎవరికీ ఏ వర్గంతోనూ విబేధాల్లేవు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. అందరితో సత్సంబంధాలున్నాయి. మూడు తరాలుగా కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్న కుటుంబం కావడంతో సీఎం అభ్యర్ధిగా పూర్తి అవకాశాలున్నాయి. 

ఈ ఇద్దరితో పాటు ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత సీతక్క పేరు కూడా విన్పిస్తోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత కూడా. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సీతక్క పేరు కొత్తగా చర్చల్లోకి వస్తోంది. ఈ ముగ్గురికి తోడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్శింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు కూడా విన్పిస్తున్నాయి. 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో కొనసాగుతున్న కౌంటింగ్, వెనుకంజలో కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News