Telangana MLC Polls: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు-ప్రారంభమైన పోలింగ్

Telangana Local Body MLC Elections 2021 : తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు పోలింగ్ కొనసాగుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 09:49 AM IST
  • తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
  • ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
  • ఆరు స్థానాలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 14న ఫలితాల లెక్కింపు
 Telangana MLC Polls: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు-ప్రారంభమైన పోలింగ్

Telangana Local Body MLC Elections 2021 : తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు (Telangana MLC Polls) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు పోలింగ్ కొనసాగుతుంది. కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఆరు స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా... మొత్తం  5,326 మంది ఓటర్లు ఓటు హక్కు (Voting in MLC Elections) వినియోగించుకోనున్నారు.పోలింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనుంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి.

కరీంనగర్‌‌లో‌ (Karimnagar) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది, నల్గొండ (Nalgonda) ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు, ఖమ్మంలో (Khammam) నలుగురు, మెదక్‌‌లో (Medak) ముగ్గురు,ఆదిలాబాద్‌‌లో (Adilabad) ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలం రీత్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం తథ్యమేనని చెప్పవచ్చు. అయితే కరీంనగర్‌లో రెబల్ రవీందర్ సింగ్ (Ravinder Singh) బరిలో ఉండటం ఆ పార్టీని కాస్త కలవరపెడుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం రవీందర్ సింగ్‌కు మద్దతు ప్రకటించడంతో ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందోనన్న ఆందోళన టీఆర్ఎస్‌ను వెంటాడుతోంది.

సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ (TRS) స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ప్రత్యర్థులు గాలం వేసే అవకాశం ఉండటంతో అధికార పార్టీ అప్రమత్తంగా వ్యవహరించింది. ఎప్పుడూ లేనిది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను రిసార్టులకు తరలించింది. శుక్రవారం (డిసెంబర్ 10) రోజునే వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రిసార్టుల నుంచి వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఇందుకోసం పార్టీనే ప్రత్యేక బస్సులు, వాహనాలు సిద్ధం చేసింది. ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగవద్దని తమ ఓటర్లకు టీఆర్ఎస్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అసంతృప్తి నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ (Minister KTR) సైతం స్వయంగా రంగంలోకి దిగి క్యాంపులో ఉన్న పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీలను బుజ్జగించినట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్నికలు జరగనున్న ఐదు జిల్లాల్లో మిగతా ఏ పార్టీకి టీఆర్ఎస్‌తో పోటీ పడేంత సంఖ్యా బలం లేదు. అయినప్పటికీ తమ ఓటర్లు ఎక్కడ చేజారుతారోనన్న భయంతో టీఆర్ఎస్ పకడ్బందీగా వ్యవహరించింది. 

Also Read: Bird Flu Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. అలప్పుజ జిల్లాలో వాటిపై నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News