Target ktr: ఇక నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?.. ఆ లీడర్ పరిస్థితి ఏంటి మరీ..

Target ktr: బీఆర్ఎస్ ముఖ్యనేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా.?ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా...?అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..రాజకీయంగా, ఆర్థికంగా ఆ లీడర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారా. ..?ఇంతకీ రేవంత్ టార్గెట్ చేసిన ఆ లీడర్ ఎవరు..రేవంత్ ఆ లీడర్ నే ఎందుకు టార్గెట్ చేసినట్లు..?  

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 14, 2024, 11:59 AM IST
Target ktr: ఇక నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?.. ఆ లీడర్ పరిస్థితి ఏంటి మరీ..

Target ktr: బీఆర్ఎస్ ముఖ్య నేతను టీ కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. గత కొద్ది రోజులుగా జరగుతున్న పరిణామాలను చూస్తుంటే  ఆ ప్రచారానికి బలాన్ని ఇస్తుంది. ఇంతకీ ఎవరా ముఖ్య నేత అనకుంటున్నారా..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రేవంత్ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తంది. గత కొద్ది రోజులుగా కేటీఆర్ కి సంబంధించిన పలు వ్యవహారాలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు ఐన తర్వాత అందరూ కేటీఆర్ ఫాం హౌజ్ ను కూల్చుతారు అని బాగా ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగలేదు. కానీ సమయం సందర్భం చూసి జన్వాడ ఫాం హౌజ్ పై రేవంత్ సర్కార్ బుల్డోజర్లను దించుతుందని కాంగ్రెస్ లో ప్రచారం జరగుతుంది. ఇది ఇలా ఉంటే కేవలం కేటీఆర్ ఫాం హౌజ్ వ్యవహారమే కాకుండా ఇంకా చాలా విషయాల్లో రేవంత్ సర్కార్ కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. 

కేటీఆర్ ను రాజకీయంగా , ఆర్థిక వ్యవహారాలపరంగా ఎలా దెబ్బకొట్టాలనే కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది. తెల్లారి లేచింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తుండడంతో ఎలాగైనా కేటీఆర్ నోరు మూయించాలనే దాంతో కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇటీవల జరగుతున్న పరిణామాలు చూస్తుంటే  ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కేటీఆర్ అమెరికా పర్యటన ఉన్న సమయంలో ఇక్కడ ఆయన అనచరులను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ కు సంబంధించిన అత్యంత సన్నిహితుడుగా చెప్పుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ప్రచారం జరగుతుంది. అయితే ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారో మాత్రం బయటకు చెప్పడం లేదని తెలుస్తుంది. ఆ వ్యక్తి నుంచి కేటీఆర్ కు సంబంధించి ఏదైనా కీలక సమాచారం రాబట్టారా అసలు ఎందుకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. అనేది మాత్రం ఇప్పటికీ సస్పెండ్ గా మారింది.

ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కూడా రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్  సన్నిహితులైన బడా రియల్టర్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణ ఉంది.దీనిపై ఇప్పటికే కొందరికి రెరా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరిపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అని పొలిటికల్ సర్కిల్ లో వినికిడి. అంతే కాదు గత ప్రభుత్వంలో జరిగిన కొన్న లీజులను కూడా రేవంత్ సర్కార్ రద్దు చేసింది. కేటీఆర్ సన్నిహితులకు లబ్ది చూకూర్చేలా రాయదుర్గంలో కోట్లు విలువ చేసే భూమిని లీజు కాంట్రాక్టును రద్దు చేసింది. దీంతో కేటీఆర్ ను మొదటగా ఆర్ధికంగా లాక్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. 

అంతే కాదు గత ప్రభుత్వంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసును రీ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉంది. గతంలో ఈ కేసులో కేటీఆర్ పీఏ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఆయన టార్గెట్ గానే ఈ కేసును మళ్లీ తిరగదోడాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. రేవంత్ సర్కార్ ఏర్పడిన కొత్తలో టానిక్ లిక్కర్ షాపుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. టానిక్ లిక్కర్ షాప్ రెన్యువల్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కొక్కటిగా  కేటీఆర్ కు సంబంధించిన అంశాల పట్ల తెరవెనుక పెద్ద కథే నడుస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే కేటీఆర్ టార్గెట్ గా ఏదైనా జరగవచ్చనే గుసగుసలు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగుతుంది.  

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

మరోవైపు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న కేటీఆర్ తన చుట్టూ ఏర్పడుతున్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అవసరాన్ని బట్టి న్యాయ స్థానాలను సంప్రదించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి తరుచూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ కంట్లో నలుసులా మారారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేటీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలంటే ఏదో రకంగా అతనిని లాక్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.అందులో భాగంగానే కేటీఆర్, ఆయన సన్నిహితులు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అదే సమయంలో రాజకీయంగా కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కేటీఆర్ ను రేవంత్ రెడ్డి మాత్రం అంత ఈజీగా వదలడనేది రాజకీయ విశ్లేషకుల అంచనా..కేటీఆర్ లాంటి నాయకుడిని లాక్ చస్తే అటోమెటిక్ గా మిగితా బీఆర్ఎస్ నాయకులు గప్ చుప్ అవుతారని కాంగ్రెస్ ఆలోచిస్తుంది.మొత్తానికి కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. కేటీఆర్ ను కంట్రోల్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను కాంగ్రెస్  పరిశీలిస్తుంది.

 మరోవైపు  కేటీఆర్ ను లాక్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయి..అసలు రేవంత్ సర్కార్ కేటీఆర్ ను ఎలా డీల్ చేస్తుంది..కాంగ్రెస్ ప్రయత్నాలను కేటీఆర్ ఏ రకంగా డీల్ చేస్తారు..కేటీఆర్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో కాలమే సమాధానం చెబుతుంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News