హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి తలసాని కామెంట్స్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి తలసాని కామెంట్స్

Last Updated : Oct 24, 2019, 03:05 PM IST
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి తలసాని కామెంట్స్

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.హుజూర్ నగర్ ఓటర్ల తీర్పు టీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు వేసిన మార్కులకు నిదర్శనం లాటిందని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారనడానికి ఇంతకన్నా ఏం కావాలని ప్రశ్నించిన తలసాని.. కేసీఆర్‌ నాయకత్వానికి ఇది ప్రజలు ఇస్తున్న తీర్పుగా అభివర్ణించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటున్నవారు ఇకనైనా కళ్లు తెరవాలని మంత్రి తలసాని హితవు పలికారు. 

గెలుపు, ఓటములపై మంత్రి తలసాని స్పందిస్తూ.. గెలిస్తే పొంగిపోము, ఓటమికి కుంగిపోమని అన్నారు. గెలుపు, ఓటములను రెండింటినీ సమానంగా భావిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

Trending News