"టుడే ఫర్ టుమారో" హైదరాబాద్ లోనే : కేటీఆర్

ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి మరోసారి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరగనుందని తెలిపారు. "టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల

Last Updated : Feb 15, 2020, 11:22 PM IST
"టుడే ఫర్ టుమారో" హైదరాబాద్ లోనే : కేటీఆర్

హైదరాబాద్: ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి మరోసారి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరగనుందని తెలిపారు. "టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరగనుందని, ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకొని, పెట్టుబడులు పెట్టి, అవసరమైన చర్యలను విధానాలను రూపకల్పన చేసేందుకు మూడు రోజులపాటు ఈ సమావేశాల్లో చర్చించనున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వామ్యం కానున్నాయని, ఈ సంవత్సరం స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, అస్సాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామి రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

బయో ఏసియా సదస్సు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి పరిశ్రమల మౌలిక వసతుల ప్రమాణాలను, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు బయో ఏషియా ఒక చక్కని అవకాశంగా ఉందని తెలిపారు. ఇక్కడి బయో, లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ గురించి నేరుగా తెలుసుకోవడానికి ఈ సదస్సు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నదని అన్నారు. ఈ సదస్సును విజయవంతం చేసి హైదరాబాద్ లో మరిన్ని లైఫ్ సైన్సెస్ ఫార్మా పెట్టుబడులు రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
 
ఈ సమావేశాల్లో ప్రధానంగా భారతదేశం లైఫ్ సైన్సెస్, ఫార్మా పరిశ్రమ, మెడికల్ డివైసెస్, డిజిటల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాదులను (ఎపిడమిక్స్) మరింత సమర్ధంగా ఎదుర్కోవడమేలా అనే అంశం, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లుకు చవకైన పరిష్కారాలను కనుగొనడం వంటి పలు కీలకమైన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారని తెలిపారు. లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ, హెల్త్ కేర్  రంగంలో మహిళలు సాధించిన ప్రగతి పైన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి సేవలు గుర్తించనున్నట్లు తెలిపారు. ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అనేక దేశాల నుంచి ఎంపిక చేసిన డెబ్భై ఐదు స్టార్టప్ కంపెనీలు సూమారు 175 ప్రదర్శనలను ప్రదర్శనలు ఇవ్వనున్నాయని తెలిపారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News