Telangana: సెక్రటేరియట్ వ్యవహారంలో కలగజేసుకోం: సుప్రీంకోర్టు

వివాదాస్పదంగా మారిన  సచివాలయ కూల్చివేత ( Secretariat Demolition ) వ్యవహారంలో  తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ( Supreme court ) ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయడమే కాకుండా...తాము కలగజేసుకోమని స్పష్టం చేసింది.

Last Updated : Jul 17, 2020, 12:45 PM IST
Telangana: సెక్రటేరియట్ వ్యవహారంలో కలగజేసుకోం: సుప్రీంకోర్టు

వివాదాస్పదంగా మారిన  సచివాలయ కూల్చివేత ( Secretariat Demolition ) వ్యవహారంలో  తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ( Supreme court ) ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయడమే కాకుండా...తాము కలగజేసుకోమని స్పష్టం చేసింది.

తెలంగాణలోని  132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి అధునాతనమైన కొత్త సెక్రటేరియట్ ( New Secretariat ) నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం ( KCR Government ) సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా కోర్టు అడ్డంకుల్ని అధిగమించి కూల్చివేత పనులు ప్రారంభించింది. అయితే కూల్చివేత ఆపాలంటూ దాఖలైన మరో పిటీషన్ పై హైకోర్టు తీర్పు నేపధ్యంలో పనులు నిలిచిపోయాయి. పనులు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేత పనుల్ని నిలిపేయాల్సివచ్చింది. ఈ స్టే ఇవాళ శుక్రవారం వరకూ ఉంది. Also read: TS Secretariat: కూల్చివేతపై మళ్లీ నిరాశే

ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం అపెక్స్ కోర్టు ( Supreme Apex Court ) నుంచి ఊరట లభించింది. కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణంపై తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( congress Mlc Jeevan Reddy )  సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. కొత్త సచివాలయ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని..ఇందులో తాము కలగజేసుకోమని సుప్రీంకోర్టు ( Supreme Court ) స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు...సెక్రటేరియన్ నిర్మాణాన్ని వ్యతిరేకించేవారికి ఓ చెంపపెట్టు లాంటిదని టీఆర్ఎస్ వర్గాలు ( TRS ) వ్యాఖ్యానిస్తున్నాయి. Also read: IAS Sweta mohanty: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్

Trending News