Bhadradri temple: భద్రాద్రిలో అద్భుతం.. ఆలయ శిఖరాన్ని తాకిన సూర్య కిరణం

Bhadradri Ramalayam: భద్రాద్రిలో బుధవారం అద్భుతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి రాముడి ఆలయంపై ( Bhadrachalam temple ) ఆకాశంలో సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో ఓ వలయాకారం ఏర్పడగా.. అదే సమయంలో ఓ సూర్య కిరణం ప్రత్యేకంగా ఆలయ శిఖరాన్ని తాకినట్టు కనిపించిందని.. చూడటానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Jul 8, 2020, 11:29 PM IST
Bhadradri temple: భద్రాద్రిలో అద్భుతం.. ఆలయ శిఖరాన్ని తాకిన సూర్య కిరణం

Bhadradri Ramalayam: భద్రాద్రిలో బుధవారం అద్భుతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి రాముడి ఆలయంపై ( Bhadrachalam temple ) ఆకాశంలో సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో ఓ వలయాకారం ఏర్పడగా.. అదే సమయంలో ఓ సూర్య కిరణం ప్రత్యేకంగా ఆలయ శిఖరాన్ని తాకినట్టు కనిపించిందని.. చూడటానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సూర్య కిరణాలు ( Sun rays ) దేవాలయ శిఖరాన్ని తాకడం సర్వ సాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఈ దృశ్యం మాత్రం తమకు కొత్తగా కనిపించిందని ఆ దృశ్యాన్ని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారింది ( Video goes viral ). ( Also read: AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్ర బస్సులు )

ఇదిలావుంటే  శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ( Arasavalli temple ) ప్రతీ ఏటా ఓసారి సూర్య నారాయణ స్వామి విగ్రహం పాదాలపై సూర్య కిరణాలు పడతాయనే సంగతి తెలిసిందే. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పులు చోటుచేసుకునే సందర్భంలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో సూర్య నారాయణ స్వామి ఆలయానికి ( Surya narayana swamy temple ) తరలివస్తారు. తాజాగా భద్రాద్రి ఘటన నేపథ్యంలో భక్తులు అరసవల్లి ఆలయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ( Also read: Coronavirus: గాలితో కూడా కరోనా: WHO )

Trending News