Student appeals to KCR: 'సీఎం సార్ నేను చనిపోతా అనుమతివ్వండి ప్లీజ్'​.. అంటూ విద్యార్థి విజ్ఞప్తి

Student appeals to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​కు ఓ బాలుడు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అక్కా, బావలు వేధిస్తున్నారని.. తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆ బాలుడు కోరాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 09:00 PM IST
  • చనిపోయేందుకు అనుమతివ్వాలని సీఎంకు బాలుడి విజ్ఞప్తి
  • అక్క, బావల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆవేదన
  • ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేకనే కోరుతున్నానని వెల్లడి
Student appeals to KCR: 'సీఎం సార్ నేను చనిపోతా అనుమతివ్వండి ప్లీజ్'​.. అంటూ విద్యార్థి విజ్ఞప్తి

Student appeals to KCR: తనకు చనిపోయేందుకు అనుమతివ్వాలంటూ పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు తెలంగాణ సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను కోరాడు. అక్క, బావల వేధింపులు తాలలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు విషయం ఏమింటంటే..

ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలుడి తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. దీనితో ఆయన భార్యకు అటెండర్​గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.

ఉద్యోగం చేస్తూ ఆమె బాలుడుని చదివించేది.. కూతురు వివాహం కూడా చేసింది. ఇక గత ఏడాది ఆమె కూడా మరణించడంతో బాలుడు.. హుజూర్​నగర్​లోని అక్క దగ్గరకు చేరాడు.

అయితే ఆ బాలుడు బాగోగులు చూసుకోవాల్సిన ఆ అక్క.. తల్లి ఉద్యోగం, ఆస్తి, ఉన్న డబ్బులు అన్ని ఇవ్వాలంటూ తమ్ముడిపై ఒత్తిడి చేస్తోంది (బాలుడు చెప్పిన వివరాలు ఇవి). అమె భర్త కూడా ఇందుకు వంత పాడటంతో బాలుడు.. అక్క వద్ద నుంచి వచ్చేసి నేలకొండ పల్లిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చిన్న వయసులో ఒక్కడే రూంలో ఉంటూ చదువుకుంటున్నాడు.

అయినా కూడా అక్క, బావలు ఫోన్​ చేసి మరి ఆస్తి, ఉద్యోగం విషయమై ఒత్తిడి చేస్తున్నారని బాలుడు వాపోయాడు. ఈ ఒత్తిడి భరించలేక చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని మీడియా ద్వారా కేసీఆర్​, కేటీఆర్​లను కోరాడు.

Also read: మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..

Also read: Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,603 కొవిడ్ కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News