TRS Mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ దూకుడు.. తుషార్‌కు నోటీసులు

SIT Officials Issues Notice To Tushar: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ దూకుడు పెంచింది. ఈ కేసులో తుషార్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల లీక్ అయిన వీడియోల్లో తుషార్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 08:43 PM IST
TRS Mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ దూకుడు.. తుషార్‌కు నోటీసులు

SIT Officials Issues Notice To Tushar: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సిట్.. తాజాగా తుషార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఫామ్ హౌజ్ డీల్‌కు సంబంధించి బయటికి వచ్చిన ఆడియో, వీడియాల్లో తుషార్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతీతో పాటు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో తుషార్ మాట్లాడారు. ఇక తుషార్‌కు సంబంధించి మరో ప్రచారం కూడా జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తుషార్ సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో కూడా తుషార్, అమిత్ షా కలిసి ఉన్న ఫోటోను చూపించారు. బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే డీల్ జరిగిందని ఆరోపించారు.

గవర్నర్ తమిళి సైకి తుషార్ అత్యంత సన్నిహితుడనే గతంలో వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్‌లో రాజ్ భవన్‌కు లింకులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. ఈ విషయంలో స్పందించిన గవర్నర్ తమిళి సై.. తనను ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్ భవన్‌ను లాగాలని చూశారని ఆరోపించారు. తుషార్ గతంలో తన ఏడీసీగా పని చేశారని.. తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని అన్నారు. ఆయన తన ఏడీసీగా పని చేసినంత మాత్రానా రాజ్ భవన్‌ను ఈ కేసులోకి లాగుతారా..? అని గవర్నర్ ప్రశ్నించారు. తాజాగా తుషార్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. 

తుషార్ పూర్తి పేరు తుషార్ వెల్లపల్లి. తండ్రి పేరు నటేశన్. వీళ్లకు  భారత ధర్మ జనసేన అనే పార్టీ ఉంది. కేరళలో బీజేపీతో ఈ పార్టీకి పొత్తు ఉంది. కేరళ ఎన్డీఏ కన్వీనర్ గా తుషార్ పని చేశారు. బీడీజేఎస్ నుంచి వయనాడులో రాహుల్ గాంధీపై పోటీ చేశారు. 

ఎమ్మెల్యేల ఎర  కేసులో సిట్ విచారణ వేగంగా సాగుతోంది. సిట్ మెంబర్ ఉన్న నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వర్ నేతృత్వంలోని టీమ్ కేరళలో సోదాలు చేస్తోంది. జగ్గు స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. రామచంద్ర భారతితో జగ్గుస్వామికి అత్యంత సన్నిహితుడని.. అతనే ఈ కేసులో కీలకంగా ఉన్నారని సిట్ భావిస్తోంది. కేరళతో పాటు హర్యానా, తిరుపతిలోనూ సోదాలు జరుగుతున్నాయి. కేరళలోని అమృతానందమయి ఆశ్రమంలో ఒక టీమ్.. అమృత మెడికల్ ఇన్సిట్యూట్‌లో  తనిఖీలు చేపట్టింది. జగ్గుస్వామి ఆ సంస్థలో కొంత కాలంగా ఉద్యోగం చేయడంతో సోదాలు జరిపారని తెలుస్తోంది. రామచంద్ర భారతి ఆశ్రమం పొందినట్లుగా గుర్తించిన కాసర్ గడ్‌లోని మరో ఆశ్రమంలో సిట్ సోదాలు చేసింది.

మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై హైదరాబాద్ పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. తమను నందు మోసం చేశారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Babar Azam: టీ20 ప్రపంచ కప్‌లో పాక్ ఓటమి.. బాబర్ ఆజామ్ సోదరుడికి నోటీసులు  

Also Read: DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News