Sankranti 2022: కరోనా కేసులు పెరిగినా.. హైదరాబాద్‌లో ఆగని కైట్స్ విక్రయాల జోరు..

Kites business in Hyderabad:  కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కైట్స్ వ్యాపారం బాగా జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈసారి కైట్స్ ధరలు పెరిగాయని.. అయినప్పటికీ మంచి గిరాకీ ఉందని హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 10:25 AM IST
  • హైదరాబాద్‌లో కైట్స్ విక్రయాల జోరు
  • ధూల్‌పేట్‌లో బాగా జరుగుతోన్న బిజినెస్
  • కరోనా కేసులు పెరిగినప్పటికీ తగ్గని వ్యాపారం
Sankranti 2022: కరోనా కేసులు పెరిగినా.. హైదరాబాద్‌లో ఆగని కైట్స్ విక్రయాల జోరు..

Kites business in Hyderabad: సంక్రాంతి  పండగ అనగానే పండి వంటలు, వాకిళ్లలో రథం ముగ్గులు, భోగి మంటలు, హరిదాసుల కీర్తలు, ఇంటి ముందుకొచ్చే గంగిరెద్దులు.. ఇవన్నీ గుర్తుకొస్తాయి. అలాగే గాలి పటాలు కూడా. చిన్నా, పెద్దా తేడా లేకుండా సంక్రాంతి పండగ వేళ అందరూ గాలి పటాలు ఎగరేసి ఆనందంగా గడుపుతారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మార్కెట్‌లో రంగురంగుల గాలి పటాలు దర్శనమిస్తున్నాయి. నిజానికి కోవిడ్ కారణంగా ఈసారి గాలి పటాల వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉంటుందా ఉండదా అన్న సందేహం ఉండేది. కానీ ప్రస్తుతం కైట్స్ బిజెనెస్ ఆశించిన స్థాయిలోనే ఉందంటున్నారు వ్యాపారులు.

ఎక్స్‌ట్రా కైట్స్ కొనుగోలు చేస్తున్న పేరెంట్స్ :

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కైట్స్ వ్యాపారం బాగా జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈసారి కైట్స్ ధరలు పెరిగాయని.. అయినప్పటికీ మంచి గిరాకీ ఉందని హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ముందుగానే ఎక్స్‌ట్రా కైట్స్ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని... తద్వారా తరచూ పిల్లలు బయటకు వెళ్లే అవసరం లేకుండా జాగ్రత్తపడుతున్నారని చెప్పారు.

ధూల్‌పేట్‌కి చెందిన అనిల్ సింగ్ అనే కైట్స్ వ్యాపారి ఒకరు మాట్లాడుతూ... 'ఇక్కడి కైట్స్ చాలా ఫేమస్. కైట్సే కాదు.. ఇక్కడ తయారయ్యే గణపతి విగ్రహాలు, రాఖీలు కూడా చాలా ఫేమస్. గుజరాత్‌లో ప్లాస్టిక్ పేపర్‌తో కైట్స్ తయారు చేసి విక్రయిస్తారు. కానీ హైదరాబాద్‌లో పేపర్ కైట్స్‌నే తయారుచేస్తాం. ఈసారి పేపర్, కర్ర ధరలు పెరగడంతో.. కైట్స్ ధరలు కూడా పెరిగాయి. క్వాలిటీ పరంగా, డిజైన్స్ పరంగా ఇక్కడి కైట్స్‌ బెస్ట్ అని చెప్పవచ్చు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి సైతం కైట్స్ కొనుగోలు చేసేందుకు ధూల్‌పేట్‌కు వస్తుంటారు.' అని పేర్కొన్నారు.

ధూల్‌పేట్‌లో లభించే మాంజా దారం కూడా చాలా ఫేమస్ అని అనిల్ సింగ్ పేర్కొన్నారు. చైనీస్ మాంజాతో పక్షులకు హాని జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం దాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణ దారంతో తయారుచేసిన మాంజానే ఇప్పుడు విక్రయిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రతీ ఏటా ధూల్‌పేట్‌లో 20 కొత్త కైట్ షాప్స్ :

కన్హయ్య సింగ్ అనే మరో కైట్ వ్యాపారి మాట్లాడుతూ.. ధూల్‌పేట్‌లో లభించే కైట్స్ అంత సులువుగా చిరిగిపోవని అన్నారు. ప్రతీ ఏడాది సంక్రాంతి (Makar Sankranti 2022) సమయంలో ధూల్‌పేట్‌లో 20 కొత్త కైట్ షాప్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. ఇన్ని షాపులు ఉన్నప్పటికీ కైట్స్‌కి కొరత ఏర్పడుతుందని.. దీన్నిబట్టి వ్యాపారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పిల్లలను ఇళ్లకు పరిమితం చేసేందుకు చాలామంది పేరెంట్స్ కైట్స్ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

Also Read: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News