Munugode Results: టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడానికి కారణమిదే.. ఆ రెండు గుర్తులతో తారుమారు

TRS Win in Munugode: మునుగోడు ఎన్నికల్లో 10,309 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు గులాబీ పార్టీ మెజార్టీపై గండికొట్టారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 08:34 AM IST
Munugode Results: టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడానికి కారణమిదే.. ఆ రెండు గుర్తులతో తారుమారు

TRS Win in Munugode: మునుగోడు ఎన్నికల పర్వం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్‌ సర్వేలే నిజమయ్యాయి. కాంగ్రెస్ కోటపై గులాబీ జెండా రెపరెపలాడింది.  హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపొంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బలంగా దూసుకెళ్లాలని భావించిన బీజేపీ ఆశలు నెరవేరలేదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి చివరివరకు గట్టి పోటీఇచ్చారు. పాల్వయి స్రవంతి నామమాత్రపు పోటీ ఇచ్చినా.. బీజేపీ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించారు.  

కారు గుర్తును పోలిఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్‌ గుర్తులు టీఆర్ఎస్ అధిక్యానికి భారీగా గండి కొట్టాయి.  చపాతి మేకర్‌కు 2,407, రోడ్డు రోలర్‌కు 1,874 ఓట్లు పడడం విశేషం. కారు గుర్తుతో పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ ఈసీని కోరింది. అయినా ఆ గుర్తులను తొలగించలేదు. 

దీంతో తమకు మెజార్టీ తగ్గిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చెప్పుల గుర్తుకు కూడా 2,270 పడటం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఎస్పీకి కాస్త కలిసి వచ్చింది. 4,145 ఓట్లు ఆ పార్టీకి పోలయ్యాయి. మొత్తానికి అటు ఇటుగా మరో పది వేల మెజార్టీ తగ్గిపోయిందని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. 

మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించగా.. 2,3,15వ రౌండ్స్‌లో బీజేపీ లీడ్ సంపాదించింది. అయితే ప్రతి బూత్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. అన్ని మండలాల్లోనూ గులాబీ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్ మండలంలో టీఆర్‌ఎస్‌కే లీడ్ వచ్చింది. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ బాగా ప్రభావం చూపించింది. 

ఇక్కడ తాను అనుకున్నంత మెజార్టీ రాలేదని రాజగోపాల్ రెడ్డి కూడా అంగీకరించారు. సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, గట్టుప్పల, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోనూ ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కట్టారు. వామపక్ష పార్టీలు టీఆర్ఎస్‌కు సహకరించడం కూడా కలిసివచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్‌ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: Adipurush Release Date : ఆదిపురుష్ వెనక్కి.. సంక్రాంతి రేస్ నుంచి అవుట్.. వంద కోట్లతో రిపేర్లు?

Also Read: Tanzania Plane Crash: విక్టోరియా సరస్సులో విమానం కూలి 19 మంది దుర్మరణం
  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News