ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రాణహాని..!

ప్రజా గాయకుడు గద్దర్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 

Last Updated : Jan 21, 2018, 08:59 AM IST
ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రాణహాని..!

ప్రజా గాయకుడు గద్దర్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తనపై కాల్పులు జరిగి దాదాపు 20 సంవత్సరాలైనా.. అప్పటి ప్రభుత్వం లేదా ఇప్పటి ప్రభుత్వం గానీ ఎలాంటి విచారణలూ జరపలేదన్నారు. అదే ఘటనకు సంబంధించి సీబీఐ స్థాయిలో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని తాను ప్రధానికి, రాష్ట్రపతికి కూడా లేఖ రాశానని ఆయన తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్నారు. బుర్రకథ మాధ్యమంగా ఆయన వూరూరా తిరుగుతూ ఉద్యమ ప్రచారం చేసేవారు.1971లో సినీ దర్శకుడు బి.నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ తన మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్ పలు సినిమా పాటలు కూడా రాశారు. మావోయిస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా గద్దర్ తెలంగాణకే మద్దతు తెలిపారు. 

Trending News