Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో విపక్షాలు దూకుడు పెంచాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి

Written by - Srisailam | Last Updated : Jun 25, 2022, 11:39 AM IST
  • కేసీఆర్ చేతికి పీకే సర్వే రిపోర్ట్
  • బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్
  • పీకే సర్వేతో రేవంత్ టీమ్ సంబరం
Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో విపక్షాలు దూకుడు పెంచాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ కు కలిసివచ్చేలా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆ పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు లేవు. త్వరలో తమ పార్టీలోకి బడా నేతలు వస్తారని కమలనాథులు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు.. కాని ఆ పార్టీలోకి ఎవరూ రావడం లేదు. అధికార టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు తమ దారి చూసుకుంటున్నారు.

వరుస చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ కు మరో తీపి కబురు వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఐ ప్యాక్ టీమ్ లు రాష్ట్రమంతా తిరుగుతూ జనం నాడి పడుతున్నాయి. పీకే టీమ్ సర్వే ఇప్పటికే కేసీఆర్ కు చేరిందని తెలుస్తోంది. అందులో కారు పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయంటున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై జనాలు ఆగ్రహంగా ఉన్నారని పీకే సర్వేలో తేలిందని తెలుస్తోంది. ఇప్పుడున్న సిట్టింగులలో సగానికి పైగా మార్చాల్సిందేనని.. లేదంటే పార్టీ గెలవడం కష్టమని కేసీఆర్ కు ...  పీకే రిపోర్ట్ ఇచ్చారని సమచారం. మెజార్టీ సిట్టింగులకు మార్చకపోతే ఏం చేసినా ఫలితం ఉండదని కూడా పీకే తేల్చి చెప్పారని చెబుతున్నారు .పీకే టీమ్ సర్వేతో షాకైన కేసీఆర్.. దిద్దుబాటు చర్యలపై మేథో మథనం చేస్తున్నారని అంటున్నారు. పీకే సర్వే రిపోర్టుల ఆధారంగా నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. అందుకే కొన్ని రోజులుగా ఆయన ప్రగతి భవన్ నుంచి బయటికి రావడం లేదని చెబుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంస ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. అయినా సీఎం కేసీఆర్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఏదో ఒక ప్రెస్ నోట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో రాజకీయ హడావుడి కొనసాగుతోంది. అన్ని పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాని కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. జాతీయ పార్టీ ప్లాన్ చేస్తున్నానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికలను పట్టించుకోకపోవడం చర్చగా మారింది. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలి. కాని పీకే సర్వేతో పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని తేలడంతో కేసీఆర్ షాక్ అయ్యారని అంటున్నారు. అందుకే ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. పీకే టీమ్ తో కలిసి ఏ నియోజకవర్గం ఎవరూ బలంగా ఉన్నారు.. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే చర్చలు చేస్తున్నారని సమాచారం. ఇప్పుడున్న సిట్టింగులలో చాలా మందిని తప్పించాలని గులాబీ బాస్ దాదాపుదా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

పీకే టీమ్ సర్వేతో గులాబీ పార్టీలో గుబులు రేపుతుండగా.. కాంగ్రెస్ లో మాత్రం జోష్ కనిపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉందని పీకే సర్వేలో వచ్చిందట. తెలంగాణలో దూకుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి మూడో స్థానమేనని పీకే టీమ్ స్పష్టం చేసిందట. ఈ విషయం తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వర్గీయులు అయితే పండగ చేసుకుంటున్నారని అంటున్నారు. రాష్ట్రంలో రేవంత్ మేనియా మొదలైందని.. ఇది రానురాను మరింతగా పెరుగుతుందని అంటున్నారు. ఎన్నికల నాటికి వార్ వన్ సైడ్ గా మారుతుందని.. కాంగ్రెస్ కు బంపర్ విక్టరీ ఖాయమని రేవంత్ అనుచరులు చెబుతున్నారు. పీకే టీమ్ సర్వే రిపోర్టులో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందన్న సమాచారంతో రేవంత్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారని అంటున్నారు. అందులో భాగంగానే వలసలు కొనసాగుతున్నాయని అంటున్నారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. 

Read also: KCR BRS Party: ఆ తర్వాతే జాతీయ పార్టీపై ప్రకటన.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

Read also: Covid Cases Updates: లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఐదు నెలల గరిష్టం.. భారత్ లో  విజృంభిస్తున్న కొవిడ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News