Revanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy Reacts To KTR Notices: టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందిపోయింది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 07:16 AM IST
Revanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy Reacts To KTR Notices: టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందిపోయింది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. కల్వకుంట్ల కుటుంబానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అందుకే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుతో సంబంధం ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదు అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పెద్ద వివాదం అయింది. ఇంత పెద్ద పొరపాటు జరిగినందుకు కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి పారదర్శకంగా విచారణ చేయిస్తారనుకున్నాం. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయకపోగా.. సిట్‌తో ఉల్టా కేసులు వేయించి మా విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు అని హితవు పలికారు. టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో అసలు నేరమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీల పేర్లు పెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా కేసులో కావాల్సిన వారిని కాపాడి.. చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం జరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతోంది అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై మేం ఇప్పటికే కోర్టుకు వెళ్లాం. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశాం. కేటీఆర్‌తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని ఈడీని కోరాం. సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు స్పష్టమైన సమాచారం అందింది. అందుకే ఈడీని కలుగచేసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేశాం. మరీ ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన అభ్యర్థుల సమాచారం కేటీఆర్ కు పనిగట్టుకుని అందించిన వారు ఎవరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ విషయాలన్నీ ఈడి దృష్టికి తీసుకెళ్లగా.. వారు పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారు.
కేటీఆర్ తెలంగాణ పరువు తీశారు. పరువు ఉన్న వారే పరువు నష్టం దావా వేస్తారు. నిజంగా కేటీఆర్‌కు పరువు ఉంటే.. సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శకంగా విచారణ జరిపించేందుకు అదేశాలివ్వాలి. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా లేఖ రాయాలి అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పరువు 100 కోట్ల రూపాయలే అని ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : KTR's Open Letter to Centre: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ.. విషయం ఏంటంటే..

ఇది కూడా చదవండి : Bandi Sanjay To KTR: కేటీఆర్ రూ. 100 కోట్ల లీగల్ నోటీసులపై బండి సంజయ్ కౌంటర్ ఎటాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News