రేవంత్ రెడ్డిపై ఎస్సై ఫిర్యాదు.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు

రేవంత్ రెడ్డిపై ఎస్సై ఫిర్యాదు.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Last Updated : Oct 24, 2019, 08:45 AM IST
రేవంత్ రెడ్డిపై ఎస్సై ఫిర్యాదు.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నాడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లే క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లిపోయినట్టుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట విధులు నిర్వహిస్తున్న ఎస్సై నవీన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వాహణలో ఉన్న అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకుగాను రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 

Also read : రేవంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఏం జరిగింది ?

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నిత్యం వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అక్టోబర్ 21న కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే, రేవంత్ రెడ్డిని అసలు ఇంట్లోనుంచే బయటకు రానివ్వొద్దని భావించిన పోలీసులు.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 48లో ఉన్న ఆయన నివాసం వద్ద భారీగా మోహరించి ఆయన్ను హౌజ్ అరెస్టు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్, తన అనుచరులతో కలిసి బయటకు వేగంగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న తన అనుచరుడి బుల్లెట్ బైక్‌‌పై ప్రగతి భవన్‌ వైపు దూసుకెళ్లారు. అదే క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నవీన్ రెడ్డి సహా పోలీసు సిబ్బంది రేవంత్‌ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి వారిని పక్కకు జరుపుకుంటూ ముందుకెళ్లిపోయారు.

Trending News