Rapido clarification: బాలిక పై అత్యాచారం.. ర్యాపీడో సంస్థ ఇచ్చిన ఫుల్ క్లారిటీ ఇదే..

Hyderabad: మైనర్ బాలికపై అత్యాచార ఘటన బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సంస్థ తెలిపింది. అంతే కాకుండా ఈ ఘటనకు పాల్పడింది ర్యాపీడో డ్రైవర్ అంటూ అనేక మీడియాల్లో కథనాలు వచ్చాయని, దీనిపై సంస్థ పూర్తిగా క్లారిటీ ఇచ్చింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 24, 2024, 09:53 PM IST
  • హైదరాబాద్ ఘటనపై స్పందించిన ర్యాపీడో..
  • తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదంటూ వివరణ..
Rapido clarification: బాలిక పై అత్యాచారం.. ర్యాపీడో సంస్థ ఇచ్చిన ఫుల్ క్లారిటీ ఇదే..

Rapido organisation clarification regarding minor raped alligations: ఇటీవల హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. సికింద్రాబాద్ కు చెందిన ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తుందని మందలించారు. దీంతో ఆమె ఇంట్లోనుంచి బైటకు వచ్చేసి, రోడ్డుమీద ఏడ్చుకుంటూ వెళ్తుంది. సందీప్ రెడ్డి అనే యువకుడు ఆమెను గమనించి, మాయమాటలు చెప్పాడు. ఆమెను తనతో కోపం తగ్గేవరకు ఉండాలని కాచీగూడ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ ఘటనకు సంబంధించి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది. ఒక ర్యాపీడో డ్రైవర్ అంటూ అనేక మీడియాల్లో కథనాలు వచ్చాయి. 

Read more: Black milk: ఈ జంతువులు ఇచ్చే పాలు నల్లగా ఉంటాయి... కారణం ఏంటో తెలుసా..?

ర్యాపీడో ఇచ్చిన క్లారిటీ ఇదే..

హైదరాబాద్ లో బాలికపై జరిగిన అమానుష ఘటనకు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమైందని కంపెనీ తెలిపింది. ఈ  ఘటనపై ఇప్పటికే తమ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చిందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. అయితే ఆరోపించిన సదరు వ్యక్తి అనేక ప్లాట్‌ఫారమ్‌లతో కలసి పని చేస్తున్నాడని సంస్థ తెలిపింది.
నిందితుడు ర్యాపిడోలో నమోదు చేసుకున్నప్పటికీ, మా ప్లాట్‌ఫారమ్‌పై అతని చివరి రైడ్ సుమారుగా సాయంత్రం 6:30 గంటలకు మన్సూరాబాద్‌లోని హిమాపురి కాలనీ సమీపంలో ఉందని మా రికార్డులు సూచిస్తున్నాయని సంస్థ తెలిపింది.  దీని తరువాత, అతను ర్యాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎటువంటి రైడ్‌లు తీసుకోలేదు.

మా అంతర్గత వ్యవస్థలు తెలిపిన వివరాల ప్రకారం..  నేరం జరిగిన ప్రదేశం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సూరాబాద్‌లోని హిమాపురి కాలనీకి సమీపంలో చివరిగా అతగాడి, డ్రాప్-ఆఫ్ లొకేషన్ ఉన్నట్లు చూపుతుందని కంపెనీ తెలిపింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతను ర్యాపీడో తో ఎలాంటి విధంగా కూడా అనుసంధానించబడి లేడని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ క్లిష్ట సమయంలో బాధితురాలికి, ఆమె కుటుంబానికి తమ సంస్థ ఎంతో సానుభూతి చూపిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

ర్యాపిడోలో.. కస్టమర్‌ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే.. ఈ ఘటన జరిగినప్పడు చేసిన రైడ్.. తమ ప్లాట్‌ఫామ్‌లో జరగలేదని సంస్థ తేల్చి చెప్పింది. బాధితురాలు ర్యాపిడో ద్వారా ఎలాంటి రైడ్‌ బుక్ చేయలేదని వెల్లడించింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడు ర్యాపిడో రైడ్‌లో లేడన్న విషయాన్ని ఉద్ఘాటించింది సంస్థ... కస్టమర్లతో తమ రైడర్ లు ఎల్లప్పుడు, మర్యాదపూర్వకంగా నడుచుకొవాలన్నదే తమ విధానమని.. ఎలాంటి దుష్ప్రవర్తనను తమ సంస్థ సహించదని ర్యాపీడో తెల్చి చెప్పింది. కెప్టెన్‌ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా వారి నేపథ్య ధృవీకరణ విషయంలో ర్యాపిడో కొన్ని పర్టిక్యులర్ విధానాలను అవలంభింస్తుందని  సంస్థ ర్యాపీడో స్పష్టం చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News