Python Floods Video: వామ్మో.. హైదరాబాద్ వరదల్లో కొండచిలువ.. వీడియో ఇదే..

Rains In Hyderabad: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో వరద విపరీతంగా వస్తోంది. వరదతోపాటు పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. ఓ కొండచిలువ ఇళ్లలోకి కొట్టుకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 1, 2024, 03:20 PM IST
Python Floods Video: వామ్మో.. హైదరాబాద్ వరదల్లో కొండచిలువ.. వీడియో ఇదే..

 

Python in Hyderabad Floods Video: గత శనివారం నుంచి కురుస్తున్న నాన్ స్టాప్ వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని జనజీవనం అస్తవ్యస్తమయింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్నిచోట్ల వాగులు పొంగి ఊళ్ళ మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అంతేకాకుండా కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా క్రమంగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ కంట్రోల్ రూమ్స్‌ని కూడా ఏర్పాటు చేసింది. 

 

ఇదిలా ఉంటే హసన్ నగర్ మీరాలం ట్యాంక్ పరిధిలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వరద ప్రవాహం పెరిగిపోతోంది దీంతో ఎగువన ఉన్న ప్రదేశం నుంచి వరద విపరీతంగా వస్తోంది అలాగే ఈ ప్రదేశాల్లోని కొన్ని కాలనీలకు వరద నుంచి వస్తువులు కూడా కొట్టుకు వస్తున్నాయి. అంతేకాకుండా మీరాలం ట్యాంక్ పరిధిలో నిన్న సాయంత్రం పూట ఓ పెద్ద కొండచిలువ కొట్టుకు వచ్చింది. దీనిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా కొంతమంది స్థానికులు అక్కడి నుంచి భయాందోళనకు గురై పరుగులు తీశారు.  కొంతమంది స్థానికులు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. 

భారీ కొండచిలువ కొట్టుకు వచ్చిన ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ పాములు పట్టుకున్నారు. ఈ పట్టుకున్న పామును అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు వారు తెలిపారు. ఏది ఏమైనా ఇలా ఇళ్లలోకి పెద్ద పెద్ద కొండచిలువలు రావడం ఇదే మొదటి సారని అధికారులు అంటున్నారు. అలాగే ఇలా పాములు వరదల ద్వారా హైదరాబాద్ లోని ఏ ప్రాంతాల్లోనైనా కొట్టుకు వచ్చిన అధికారులకు సమాచారం అందించాలని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. ప్రస్తుతం ఇలా కొట్టుకు వచ్చిన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News