హైదరాబాద్: ఓ ప్రైవేట్ న్యూస్ తెలుగు ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మూసాపేట గూడ్స్షెడ్లోని ఓ అపార్ట్ మెంట్లో ఇదో అంతస్తు నుంచి దూకి రాధిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడే ముందు రాధిక ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అపార్ట్ మెంట్ వాచ్మెన్ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
రాధిక ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న తోటి మిత్రులు, ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. మీడియాలో చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రాధిక ప్రముఖ యాంకర్‌గా ఎదిగారు. కాగా రాధిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.