Pawan Kalyan: నాకు తెలంగాణ పునర్జన్మనిచ్చింది.. అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తా..: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Election Campaign: తెలంగాణ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ-జనసే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. తనకు తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని.. రాష్ట్ర అభివృద్ధిక కట్టుబడి పనిచేస్తానని అన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 11:54 PM IST
Pawan Kalyan: నాకు తెలంగాణ పునర్జన్మనిచ్చింది.. అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తా..: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Election Campaign: "అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది" అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నేమూరి శంకర్‌ గౌడ్‌ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో తాండూరులో అభిమానులు భారీగా తరలివచ్చారు. 

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని.. ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుందన్నారు. దేనికీ భయపడకుండా.. కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉందన్నారు. ఈ నేల, గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నానని అన్నారు. తనకు పదవులు మీద ఆశ, అధికారం మీద ప్రేమ అనేవి లేవని.. తనకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారని.. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోందన్నారు.

"ప్రపంచంలోనే 5వ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారతదేశం ఎదిగింది. బీసీలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లను విడుదల చేసి, వారి అభ్యున్నతికి ఖర్చు చేయడం సామాన్య విషయం కాదు. అలాగే రూ.43 వేల కోట్లను కేంద్రం తెలంగాణ కోసం ఇచ్చింది. అన్ని విధాలుగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది. ఉగ్రవాదాన్ని దేశం నుంచి రూపుమాపడంలోనే కాదు.. మా దేశంలోకి వచ్చి మీరు దాడులు చేస్తే, మీ ఇళ్లలోకి వచ్చి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు పంపేలా బీజేపీ పని చేస్తోంది. దీనివల్ల దేశంలో ఉగ్రవాదం తగ్గి, పారిశ్రామికీకరణ పెరిగింది.
యువతకు అవకాశాలు వస్తున్నాయి.
 
ఇదే తీరున దేశం ముందుకు సాగితే మరికొద్దిరోజుల్లోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తెలంగాణలోనూ బీజేపీ నాయకత్వంలో ఇలాంటి సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఒకే రకమైన ప్రభుత్వాలు ఉంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు అయితే ఎంతో వేగంగా తెలంగాణ అభివృద్ది దిశగా సాగుతుంది. 2004 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో జలయజ్ఞం పేరు చెప్పి విపరీతమైన దోపిడీ జరిగింది. అలాంటి పరిస్థితి మళ్లీ తెలంగాణలో రాకూడదు. అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉంటే పాలన కావాలి. తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణలోని అన్నీ వర్గాలకు బంగారు భవిత ఉంటుంది.." అని పవన్ కళ్యాణ్ అన్నారు. \

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News