NEET UG 2023 Updates: వైద్య విద్య అభ్యసించాలనే కోరిక అందరికీ ఉన్నా సాద్యం కాదు. కొందరికి బాధ్యతలు, మరి కొందరికి సామర్ధ్యం లేకపోవడం, ఇంకొందరికి తీరిక లేకపోవడం. అలాంటి వ్యక్తే ఇతను. నలుగురికీ పోటీ పరీక్షల్లో శిక్షణ అందించే అతనికి మెడిసిన్ చదవాలనే కోరిక ఎప్పట్నించో ఉంది..
ఈ ఘటన ఎక్కడో ఉత్తరాదినో మరో రాష్ట్రంలోనే జరగలేదు. తెలుగు రాష్ట్రం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాయల సతీష్ బాబుకు ఎప్పట్నించో మెడిసిన్ చదవాలనే కోరిక ఉంది. కానీ బాధ్యతలు, ఉద్యోగం, కోచింగ్ సెంటర్ నిర్వహణ ఇలా వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. వయస్సు 49 ఏళ్లొచ్చేసింది. కుమార్తె ఇంటర్మీడియట్ పూర్తయి..నీట్ పరీక్ష రాస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2023 పరీక్షను కుమార్తెతో కలిసి రాస్తున్నాడు ఆ తండ్రి.
వాస్తవానికి మొన్నటి వరకూ నీట్ పరీక్షకు వయో పరిమితి ఉండేది. గత ఏడాది నుంచి నేషనల్ మెడికల్ కమీషన్ ఆ వయో పరిమితి తొలగించడంతో మెడిసిన్ చదవాలనే కోర్కెను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. గతంలో జనరల్ కేటగరీకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగరీకు 30 ఏళ్లు గరిష్ట వయో పరిమితి ఉండేది. ఇప్పుడది లేకపోవడంతో రాయల సతీష్ బాబు 49 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్షకు సంసిద్ధుడయ్యాడు. అటు కూతురు కూడా ఇవాళ నీట్ పరీక్ష రాయనుంది. మొత్తానికి తండ్రీ కూతుళ్లు కలిసి పరీక్ష రాయబోతున్నారు.
సతీష్ బాబు వాస్తవానికి బీటెక్ చదివాడు. కానీ మెడిసిన్ చదవాలనే కోరిక ఉండిపోయింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ కావడంతో నీట్ పరీక్ష రాయాలంటే బయోలజీ, జువాలజీ నేపధ్యం ఉండాలి. దీనికోసం తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్ట్ నుంచి ప్రత్యేక అనుమతితో ఇంటర్మీడియట్ జువాలజీ, బోటనీ రెండు సంవత్సరాల పరీక్షలు రాసేసాడు. ఆ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు.
ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆసుపత్రి కట్టాలనేది ఆ తండ్రి ఆలోచన. నిజాయితీగా నాణ్యమైన ఆరోగ్య సేవల్ని అందించాలనేది అతని సంకల్పం. ఒకవేళ తన ఈ ప్రయత్నం విఫలమైనా ఎందరికో ఆదర్శం కాగలదంటున్నాడు ఆ తండ్రి. తండ్రితో కలిసి నీట్ పరీక్ష రాయడం సంతోషంగా ఉందంటోంది ఆ కూతురు.
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook