తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత నాయని నరసింహా రెడ్డి ( Nayani Narasimha Reddy ) సతీమణి అహల్య ( 68 ) రెడ్డి సోమవారం నాడు కన్నుమూశారు. నాయని మరణించిన నాలుగు రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి కూడా కన్నుమూయడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్
వారం రోజుల్లోనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో నాయని కుమార్తె, కుమారుడు బాధ వర్ణించలేని విధంగా ఉంది. అక్టోబర్ 22న నాయని నరసింహా రెడ్డి ఆసుపత్రిలో కన్నుమూశారు. కరోనావైరస్ ( Coronavirus ) సోకడంతో ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందుకుంటూ తుదిశ్వాస విడిచారు.
మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి శ్రీమతి నాయిని అహల్య నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అహల్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— TRS Party (@trspartyonline) October 26, 2020
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR