Munugode Bypoll: మునుగోడులో నోట్ల కట్టల గుట్టలు.. బీజేపీ డబ్బును పట్టేస్తున్న పోలీసులు.. గులాబీ లీడర్లను వదిలేస్తున్నారా?

Munugode Bypoll: మునుగోడులో గత నెల రోజుల క్రితం నుంచే డబ్బు ఏరులై ప్రవహిస్తోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నగదుపోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. కార్లలో తరలిస్తున్న నోట్ల కట్టలను చూసి పోలీసులకే షాకవుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 23, 2022, 12:26 PM IST
  • మునుగోడులో నోట్ల కట్టలు
  • భారీగా పట్టుబడుతున్న నగదు
  • టీఆర్ఎస్ డబ్బును వదిలేస్తున్నారనే ఆరోపణలు
 Munugode Bypoll: మునుగోడులో నోట్ల కట్టల గుట్టలు.. బీజేపీ డబ్బును పట్టేస్తున్న పోలీసులు.. గులాబీ లీడర్లను వదిలేస్తున్నారా?

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉప ఎన్నిక ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. మునుగోడులో గత నెల రోజుల క్రితం నుంచే డబ్బు ఏరులై ప్రవహిస్తోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నగదుపోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. కార్లలో తరలిస్తున్న నోట్ల కట్టలను చూసి పోలీసులకే షాకవుతున్నారు.

వారం రోజుల క్రితం మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు దగ్గర పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటీ రూపాయలు దొరికాయి. కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త నగదును తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బుతో పట్టుబడిన వేణు.. బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడనే వార్తలు వచ్చాయి. తర్వాత కూడా పలు ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు దొరికాయి. శనివారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ రహదారిపై పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 64 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బును కూడా మునుగోడు ఉపఎన్నిల కోసమే తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శనివారం రాత్రి మునుగోడుకు తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులదిగా చెబుతున్న కోటి రూపాయలను నార్సింగి పోలీసులు పట్టుకున్నారు. కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న రెండు కార్లను పోలీసులు తనిఖీలు చేశారు. నోట్ల కట్టలు దొరకడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పించాలని కారు డ్రైవర్లు ప్రయత్నించినా.. సినిమా స్టైల్లో ఛేజ్ చేసి కార్లను పట్టుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కోకాపేటలో ఉండే సునీల్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్న దేవల్ రాజు  అనే వ్యక్తి కారులో వస్తున్నారని పోలీసులు చెప్పారు.  వ్యాపారవేత్త హర్షవర్ధన్ అదేశాల మేరకు  సునిల్ రెడ్డి ఇచ్చిన కోటి రుపాయలను మూడు భాగాలుగా చేసి మూడు కార్లల్లో దాచారు దేవల్ రాజు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌ అనే ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడానికి కోటి రూపాయలు తీసుకెళ్తున్నట్లుగా నిందితులు చెప్పారని పోలీసుసు తెలిపారు.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలీసుల తనిఖీల విషయంలో బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. బీజేపీ నేతలపైనే పోలీసులు నిఘా పెట్టారని.. అధికార టీఆర్ఎస్ నేతలను పట్టించుకోవడం లేదని అంటున్నారు.బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఇప్పటికే నగదును గ్రామాల్లో డంప్ చేశారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ డబ్బు సరఫరా కాకుండా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని.. అందుకే ఏకంగా 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కొందరు డబ్బులతో పట్టుబడినా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎల్పీనగర్, చౌటుప్పల్ లో అధికార పార్టీకి చెందిన నేతల కార్లలో భారీగా నగదు దొరికినా.. పోలీసులు వదిలేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా మునుగోడుకు తరలిస్తుండగా పట్టుబడుతున్న నోట్ల కట్టలను చూసి జనాలు అవాక్కవుతున్నారు.

Read Also: Rahul Gandhi in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం.. జన సంద్రమైన గూడబల్లేరు

Read Also: TRS VS BJP: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్.. బీజేపీ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News