Komatireddy Venkat Reddy On Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించాలని.. ఉచిత కరెంట్ అనేది ఆయన పరిధిలోని సమస్య కాదన్నారు. హై కమాండ్ చూసుకుంటుందంటూ చురకలు అంటించారు. స్టార్ కాంపెయినర్‌గా రైతుల సమస్యను తీర్చే బాధ్యత తనదని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 24 గంటల క్వాలిటీ కరెంటు ఉండే దిశగా అడుగులు వేస్తామని భరోసాని ఇచ్చారు.
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 8 నుంచి 10 గంటలు కూడా కరెంటు ఉండడం లేదన్నారు కోమటిరెడ్డి. రైతుల కరెంట్ సమస్యను కాంగ్రెస్ తీరుస్తుందన్నారు. ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఉచిత కరెంట్ కోసం వైఎస్సార్ సోనియాని ఒప్పించారని.. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ కోసం ఎంత కష్టపడ్డామో రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. అప్పుడు రేవంత్ కాంగ్రెస్‌తో కూడా లేరు అంటూ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉందన్నారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాయితీలు అన్ని కొనసాగిస్తామని.. ఉచిత విద్యుత్ ఆలోచనే కాంగ్రెస్ పార్టీదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
"ఎన్ఆర్ఐలతో చిట్ చాట్‌లో రైతు బంధు, ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో ఉచిత విద్యుత్ ఏ మేరకు అవసరమో వివరిస్తే బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారు. రైతుల ఆర్థిక భారం పడకుండా ఆదుకోవాలని సంకల్పంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి
సీఎంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని అప్పట్లో ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు రెండు దశల్లో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలి.." అని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MP Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురకలు.. ముందు ఆ విషయం ఆలోచించు..!