Musi Project: 'మూసీ నది పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని.. దానిని ఏటీఎంలా మార్చుకుంది. అసలు మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలి' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మూసీ నదిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలపైకి.. నివాసాలపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమది ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి అని తెలిపారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ బుధవారం తెల్లవారుజామున భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గిరి ప్రదక్షిణ చేపట్టారు. అనంతరం భువనగిరిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ గూండాలు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని కవిత ఖండించారు. 'మా పార్టీ కార్యాలయాలపైకి.. ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ' అని తెలిపారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు... జాగ్రత్తగా ఉండండి అని సూచించారు.
Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్'.. రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంపు?
'ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు' అని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. 'మాటలతో.. విజ్ఞతతో.. నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాది' అని వివరించారు. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామాపై కవిత స్పందిస్తూ.. 'మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలి. పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది?' అని ప్రశ్నించారు.
Also Read: Eatala Rajender: చేయి చేసుకున్న ఎంపీ ఈటల రాజేందర్‌కు భారీ షాక్. దాడి ఘటనలో కేసు నమోదు
మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని కల్వకుంట్ల కవిత తెలిపారు. 'మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎస్టీపీలను ఏర్పాటుచేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారు. మూసీలో మురుగు నీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది' అని వివరించారు. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. మూసీని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
'హైదరాబాద్‌కు సమీపంలోని కొండపోచమ్మ సాగర్‌ను వదిలి దూరంలోని మల్లన్న సాగర్ నుంచి మూసీ - గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదు' అని కవిత అభిప్రాయపడ్డారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు వ్యయం రూ.7,500 కోట్లకు పెంచారని చెప్పారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
'మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చివేతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతుంది. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కాంగ్రెస్ కర్కశం చూపిస్తోంది' అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మూసీ ప్రక్షాళనకు వ్యయం ఒకసారి రూ.50 వేల కోట్లు, మరోసారి రూ.లక్ష కోట్లు.. ఇంకోసారి రూ.లక్షన్నర కోట్లు అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చే డబ్బును రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు' అని కవిత ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter