MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 22, 2024, 04:24 PM IST
  • అనుచరుడి మరణంతో భావొద్వేగానికి గురైన జీవన్ రెడ్డి..
  • కాంగ్రెస్ లో ఉండలేనంటూ వ్యాఖ్యలు..
MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

mlc Jeevan reddy hot comments on congress party: జగిత్యాలలో ఇటీవల రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న డాక్టర్ సంజయ్ ఇటీవల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీనిపై బహింరంగానే మండిపడ్డారు. అంతేకాకుండా.. ఢిల్లీకి పెద్దలకు కూడా తన నిరసన వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. కాంగ్రెస్ కు రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. కానీ అప్పట్లో హైకమాండ్ కల్గజేసుకుని బుజ్జగించడంతో జీవన్ రెడ్డి కాస్తంతా వెనక్కు తగ్గారు.

ఇదిలా ఉండగా.. తాజాగా, జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని కొంత మంది అత్యంత క్రూరంగా హతమార్చారు.అధికారంలో ఉండి కూడా.. తమపై దాడులు ఏంటని కూడా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఏకంగా దీనికి వెనుక బీఆర్ఎస్ నేతలున్నారని, తమ్ముడి లాంటి వ్యక్తిని కోల్పోయానంటూ కూడా జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తొందని విమర్శించారు. అంతేకాకుండా.. దీనిపై సొంత పార్టీ నేతలపై కూడా మండిపడ్డారు.

ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కూడా.. అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామన్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ.. ‘నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. మరొవైపు ఈ ఘటన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. తన 40 ఏళ్ల రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ మంచి బహుమతి ఇచ్చిందని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.   మీ పార్టీ కి, మీకు ఓ దండం, మీపార్టీలో ఉండలేనంటూ కూడా తెల్చిచెప్పారు.

Read more: MLC Jeevan Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. భారీగా చేరుకున్న బలగాలు..

ఇకనైనా బ్రతక నివ్వండి అంటూ  మహేష్ కూమార్ గౌడ్ ఫోన్ కట్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్ననట్లు తెలుస్తొంది. దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. అదే విధంగా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా  పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘనట మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News