Mla jeevan reddy fires on police Jagityala incident murder: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిందని చెప్పుకొవచ్చు. సీఎం రేవంత్ ఒకవైపు ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హమీల విషయంలో ముందుకు వెళ్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గత సర్కారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనక్కు వెళ్లిందని కూడా తమదైన స్టైల్ లో ఏకీపారేస్తున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు సైతం.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ను పెంచేదిగా మారాయి. మరొవైపు బీఆర్ఎస్ కూడా ఎక్కడ తగ్గకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ లు చేస్తుందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కూడా.. తాము.. ఇచ్చిన హమీలను ఆలస్యమైన కూడా నెరవేరుస్తామని , వెనక్కు తగ్గేది లేదని బీఆర్ఎస్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ లు సైతం ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం పట్ల తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఢిల్లీకి వెళ్లి అలిగికూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఈ నేపథ్యంలో.. ఆయన కొంత వెనక్కు తగ్గినట్లు తెలుస్తొంది. తాజాగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య జరగటం జగిత్యాలలో ఒక్కసారిగా టెన్షన్ తెప్పించేదిగా మారింది. దీనిపై జీవన్ రెడ్డి రోడ్డెక్కి పోలీసుల తీరుపై, బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తొందన్నారు.
Read more: Lady Aghori: వాళ్ల అంతం చూస్తా..?.. శివతాండం చేసిన అఘోరీ మాత.. అసలేం జరిగిందంటే..?..
ఇటీవల తెలంగాణలో ముత్యాలమ్మ ఘటన కూడా రాజకీయాంగా వివాదంగా మారింది. ఒక వర్గాన్ని కాంగ్రెస్ వాళ్లు సపోర్ట్ చేస్తున్నారని హిందు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇక గ్రూప్ 1 అంశంలో కూడా... కొన్ని పార్టీలు జోక్యం చేసుకుని విద్యార్థుల్ని పక్కదోక పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం రేవంత్ సర్కారుకు అనుకూలంగా తీర్పువెలువరించింది. ఈ క్రమంలో గ్రూప్ 1 ఎగ్జామ్ లు మాత్రం ప్రశాంతంగా స్టార్ట్ అయినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.