Mlc Election Results: ఉత్కంఠ రేపిన తెలంగాణ ఎమ్మెల్సీ ఫలితాల్లో ఎట్టకేలకు ఒక ఫలితం వెలువడింది. సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగిన కౌంటింగ్‌లో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం ఖరారైంది.
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc Elections) స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒకటి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ కాగా రెండవది నల్గొండ-ఖమ్మం-వరంగల్. నాలుగురోజుల్నించి సుదీర్ఘంగా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపింది.రెండు స్థానాల్లోనూ తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అంతేకాకుండా ఎలిమినేషన్ పద్దతిలో కౌంటింగ్ జరిగింది. నల్కొండ-ఖమ్మం-వరంగల్ స్థానం కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ (Mahaboob nagar-Rangareddy-Hyderabad) కౌంటింగ్ మాత్రం పూర్తయింది. పోటాపోటీగా సాగిన కౌంటింగ్‌లో ఎట్టకేలకు టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ ( Bjp) అభ్యర్ధి రామచందర్‌రావు రెండో స్థానానికి పరిమితమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి విజయంతో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినట్టైంది.
టీఆర్ఎస్ (TRS) అభ్యర్ధి సురభి వాణిదేవి(Surabhi vanidevi) కి మొత్తం పోలైన ఓట్లు 1 లక్షా 49 వేల 269 గా ఉన్నాయి. తొలి ప్రాధాన్యతలో 1 లక్షా 12 వేల 689 ఓట్లు రాగా రెండవ ప్రాధాన్యత కింద 36 వేల 580 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్ధి రామచందర్‌రావుకు మొత్తం ఓట్లు 1 లక్షా 37 వేల 566 కాగా తొలి ప్రాధాన్యతలో 1 లక్షా 4 వేల 668 ఓట్లు వచ్చాయి. రెండవ ప్రాధాన్యతలో 32 వేల 898 ఓట్లు వచ్చాయి. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఫలితం ఇంకా తేలాల్సి ఉంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeswar reddy) ఆధిక్యంలో కొనసాగుతుండగా..రెండవ స్థానంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు.
Also read: Ys Sharmila: చరిత్రలో జరగనివిధంగా ఖమ్మం సభ ఉండాలంటున్న వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mlc Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం