Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు అసెంబ్లీలో చేదు అనుభవం!

Rasamayi Balakishan: మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. రసమయి మాట్లాడుతుండగా.. డిప్యూటీ స్పీకర్​ కలుగజేసుకుని.. ప్రసంగాలు కాకుండా ప్రశ్న ఉంటే అడగాలన్నారు. దీనితో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 01:19 PM IST
  • అసెంబ్లీలో రసమయి వర్సెస్ డిప్యూటీ స్పీకర్​
  • ప్రశ్నోత్తరాలసమయంలో వివాదం
  • పద్మారావు తీరుపై రసమయి అసహనం
Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు అసెంబ్లీలో చేదు అనుభవం!

Rasamayi Balakishan: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష సభ్యులే కాకుండా.. అధికార పార్టీ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్​ మొత్తానికి హాజరవకుండా సెస్పెండ్ చేసిన ఘటన మరవక ముందే.. శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. అధికాకర పార్టీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, డిప్యూటీ స్పీకర్​ పద్మా రావు మధ్య జరిగిన సంభాషణ సభలో కొద్ది సేపు వివాదంగా మారింది.

అసలు ఏమైందంటే..

ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకిషన్ మాట్లాడుండగా.. డిప్యూటీ స్పీకర్​ పద్మా రావు కలగజేసుకున్నారు. ప్రసంగాలు కాదని.. ప్రశ్న ఏమైనా ఉంటే అడగాలన్నారు. దీనితో స్పీకర్​ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన బాల కిషన్​ తాను ప్రశ్నే అడుకుతున్నానని ప్రసంగం చేయట్లేదన్నారు. ఈ విషయంపై డిప్యూటీ స్పీకర్ మళ్లీ రసమయిని వారించడంతో సభలో కాసేపు ఈ వివాదం కొనసాగింది. దీనిపై ఆ తర్వాత కూడా స్పందించిన బాలకిషన్​ తమను కనీసం ప్రశ్నలు కూడా అడిగేందుకు కూడా సమయం ఇవ్వకపోవడమేంటన్నారు.

తనను మాట్లాడవద్దంటే.. మాట్లాడనని కూర్చున్నారు.. చివరకు మరోసారి పద్మా రావు కలుగజేసుకుని.. ప్రశ్నను క్లుప్తంగా అడిగాలని సూచించారు. దీనితో తన ప్రశ్నను అడిగి రసమయి కూర్చున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది.

Also read: Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖుల బాగోతాలు బయటపడతాయంటున్న రేవంత్ రెడ్డి

Also read: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. బీజేపీ వైపు చూస్తున్న టీఆర్ఎస్ అసంతృప్త నేతలు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News