KTR Slams BJP: బీజేపి నేతలకు మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నలు, సెటైర్లు

KTR slams Komatireddy Rajagopal Reddy: బీజేపీకి గుడ్ బై చెప్పిన బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

Written by - Pavan | Last Updated : Oct 21, 2022, 08:18 AM IST
  • కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కేంద్రం గూడుపుఠాణి
  • బీజేపి నేతలకు కేటీఆర్ సూటి ప్రశ్న
  • బూర నర్సయ్య గౌడ్ పార్టీ మార్పు ఆత్మహత్యే..
KTR Slams BJP: బీజేపి నేతలకు మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నలు, సెటైర్లు

KTR slams Komatireddy Rajagopal Reddy: బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ డబ్బును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనే ఒక విష సంస్కృతికి తెరతీసిందన్నారు. మునుగోడు ప్రజలను కూడా అలాగే ధనమదంతో గెలవాలని కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాబలంతో గెలిచే ధైర్యం లేక దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా.. ఏ సంకల్పంతోనైతే మునుగోడు ప్రాంతంలో నెలకొన్న ఫ్లోరోసిస్ సమస్యను, మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యను, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లిందో.. అదే సంకల్పంతో మరింత ముందుకుపోతుందని తెలిపారు. 

భారతీయ జనతా పార్టీ ఒక నీతి, జాతి అంటూ లేని పార్టీ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఏ విధంగా అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి విజయాన్ని కట్టపెట్టారో.. అదే విధంగా మునుగోడులోను టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలపైన ప్రభావం చూపించే ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో మంచి నిర్ణయం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

భారీగా నిరుద్యోగం సమస్య, ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో దేశాన్ని చిట్టచివరి స్థానానికి పడేసిన ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోదీకి, ఆయన పార్టీ బిజెపికి బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రజలను కోరారు. 

కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
కిషన్ రెడ్డి ఒక నిస్సహాయ మంత్రి అని ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్‌ని విమర్శించేంత అర్హత ఏ మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన్నే మీకు ఓట్లు పడవు అనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తే ఓట్లు వేస్తారని గుర్తుచేశారు. కరోనావైరస్ కి వ్యాక్సిని కనిపెట్టిందే ప్రధాని నరేంద్ర మోదీ అన్న అమాయకుడు కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి కనీసం ఒకరు రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా చదివే తెలివి లేదని సెటైర్లు వేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కేంద్రం గూడుపుఠాణి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నడిపిస్తున్న చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయో చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందులో ఉన్న గుజరాత్ గూడుపుఠాని ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తోంది కోవర్ట్ రాజకీయాలు కాదా ? బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రజేస్తోంది వాస్తవం కాదా అని కోమటిరెడ్డి బ్రదర్స్ ని నిలదీశారు. 

బీజేపి నేతలకు కేటీఆర్ సూటి ప్రశ్న
బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఇవ్వని 3000 రూపాయల వృద్ధాప్య పింఛన్లు తెలంగాణలో ఎక్కడి నుంచి తెచ్చిస్తారని మంత్రి కేటీఆర్ బీజేపి నేతలను ప్రశ్నించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి గెలుస్తామని అనుకుంటే పొరపాటే అవుతుందని.. ప్రజలేమీ అంత అమాయకులు కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని బీజేపికి హితవు పలికారు. 

బూర నర్సయ్య గౌడ్ పార్టీ మార్పు ఆత్మహత్యే..
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మార్పుపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న సామెతను బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) నిజం చేశారని ఎద్దేవా చేశారు. పాపం ఆయన గ్రహచారం బాగాలేదని... అందుకే ఆయన పార్టీ మారారని చురకలంటించారు.

Also Read : Budida Bikshamaiah Goud: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బిక్షమయ్య గౌడ్‌కి మరీ అంత కోపం ఎందుకంటే..

Also Read : Budida Bikshamaiah Goud: బీజేపికి బూడిద భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు

Also Read : Munugode Bypoll: డబ్బుల్లిచ్చి అల్లరి చేయిస్తున్నారా.. కోమటిరెడ్డికి అడగడుగునా అడ్డంకులెందుకు? మునుగోడులో అసలేం జరుగుతోంది?

Also Read : Revanth Reddy fire on KTR: కేటీఆర్‌పై ఫైర్.. రఘునందన్, రాజేందర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Trending News