Anushka Shetty: ప్రభాస్ కన్నా ముందు వారిద్దరిని ప్రేమించిన అనుష్క? అప్పట్లో దుమారం రేపిన రూమర్స్

Anushka- Prabhas Wedding: టాలీవుడ్ స్టార్ కపుల్ ప్రభాస్, అనుష్క.. మధ్య ప్రేమాయణం నడుస్తుంది.. అని ఎప్పటినుంచో.. వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. ప్రకటన మాత్రం రాలేదు. ఈ క్రమంలో అనుష్క ఒకప్పుడు.. మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలతో ఎఫైర్.. నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 6, 2024, 07:45 PM IST
Anushka Shetty: ప్రభాస్ కన్నా ముందు వారిద్దరిని ప్రేమించిన అనుష్క? అప్పట్లో దుమారం రేపిన రూమర్స్

Anushka Shetty Love Affairs: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క కూడా ముందే ఉంటుంది. బాహుబలి తర్వాత అనుష్క రేంజ్.. పాన్ ఇండియా దాకా వెళ్ళింది. ఫిమేల్ సెంట్రిక్ సినిమా.. అనగానే అందరికీ ముందుగా.. గుర్తొచ్చేది అనుష్క పేరే. అరుంధతి తర్వాత.. ఆమె ఎన్నో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో నటించింది.. కానీ ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. 

అయితే బాహుబలి తర్వాత ఫేమ్ ..అంతే వచ్చింది.. కానీ అనుష్కకి తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే  అనుష్క వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిర్చి సినిమా సమయం నుంచే ప్రభాస్.. అనుష్క ప్రేమించుకుంటున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపించాయి.

అయితే ప్రభాస్ కంటే ముందు అనుష్క.. ఇంకో ఇద్దరు టాలీవుడ్ హీరోలతో ఎఫైర్ లు పెట్టుకుంది అని పుకార్లు వచ్చాయి. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ళు అవుతుంది. అయినా ఆమె గురించి ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో.. లింక్ అప్ రుమార్ల నుండి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. 

ఆఫ్ స్క్రీన్ లో .. చాలా పద్దతిగా ఉండే అనుష్క.. కొన్ని సినిమాల్లో.. మాత్రమే గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. ఇండస్ట్రీలో అందరూ ఆమెను స్వీటీ అని పిలుస్తారు. ఆమె పేరు లాగానే ఆమె మనసు కూడా చాలా స్వీట్.. అంటారు. కానీ అనుష్కపై కూడా అఫైర్ రూమర్స్ వచ్చాయి.

గోపీచంద్.. అనుష్క

హీరో గోపీచంద్.. అనుష్క.. కలిసి లక్ష్యం సినిమాలో నటించగా, ఆ సినిమా తర్వాత వీళ్ళ మధ్య.. ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. వీళ్ళ కాంబోలో శౌర్యం.. సినిమా కూడా రాగా వీళ్ళ మధ్య ఎఫైర్ రూమర్లు ఇంకా బలపడ్డాయి. ఈ పుకార్లు 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకునేదాకా వినిపిస్తూనే ఉన్నాయి.

అనుష్క..నాగార్జున

ఇక అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో హీరోగా నటించిన సినిమా. తర్వాత డాన్, ఢమరుకం..రగడ.. సినిమాల్లో కూడా అనుష్క, నాగార్జున జంటగా నటించగా.. నాగార్జున, అనుష్క మధ్య కూడా ఎఫైర్ అంటూ వార్తలొచ్చాయి. అయితే నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్లను ఖండించారు.

సెంథిల్ కుమార్..అనుష్క..

రాజమౌళి సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ గా చేసే కె కె సెంథిల్ కుమార్.. అనుష్క కూడా ప్రేమించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు.. అని అందరూ అనుకున్నారు కానీ అదీ జరగలేదు.  2009లో సెంథిల్ కుమార్.. వివాహం చేసుకోగా వీటికి చెక్ పడింది.

Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..

Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News