/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Minister Harish Rao: గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మొదటి సభ నిర్వహించారని.. ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష  నియోజకవర్గం అని అన్నారు. మంచి జరగుతుందని ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్‌స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారన్నారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని.. కనీసం టికెట్లు ఇచ్చుకొనే పరిస్థితిలో  లేదని విమర్శించారు. కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరు అంటూ సెటైర్లు వేశారు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారని అన్నారు.

"అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్‌లో  జరిగాయి. 8 టీఎంసీలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. నీళ్లు వస్తే ప్రతి ఒక్కరికి సంతోషం.. ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాయి. హుష్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం మీ అందరి అదృష్టం. ఈ 15వ తేదీ మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొదటి సభ హుస్నాబాద్‌లో జరుగుతుంది. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయం. 2014, 18లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. 

ఏమైతే చెప్తారో దానిని పక్క చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసింది  కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న టీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని పెట్టి ఎంతో మంది తెలంగాణ ప్రజల చావుకి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలా రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ కావాల్నా.. మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా..? హుస్నాబాద్ నియోజకవర్గం ఎందుకు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందింది.. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభివృద్ధి  చేయలేదు.." అని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. 

ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ టికెట్ ప్రకటించి 50 రోజులైనా.. ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అని ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒకటి కాదు అనేక పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. మూడోసారి కేసీఆర్ విజయం పక్క అని జోస్యం చెప్పారు.

Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Minister Harish Rao Says Opposition mind block with KCR manifesto
News Source: 
Home Title: 

TS Assembly Elections: కేసీఆర్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు
 

TS Assembly Elections: కేసీఆర్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు
Caption: 
Harish Rao (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కేసీఆర్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: హరీశ్ రావు
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Tuesday, October 10, 2023 - 16:23
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
30
Is Breaking News: 
No
Word Count: 
319