Mask Fine in Hyderabad: తెలంగాణలో మాస్క్ ధరించపోతే రూ.1,000 జరిమానా!

Mask Fine in Hyderabad: కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. తెలంగాణలోనూ ముందస్తుగా మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించనున్నారని తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 05:30 PM IST
Mask Fine in Hyderabad: తెలంగాణలో మాస్క్ ధరించపోతే రూ.1,000 జరిమానా!

Mask Fine in Hyderabad: దేశంలో కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ రాక తప్పదని నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నాయి. ఈ నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసింది. మాస్క్ లేని వారికి రూ. 1,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. 

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పుడు తెలంగాణలోనూ కరోనా నిబంధనల గురించి చర్చ జరుగుతోంది. కొవిడ్ నిబంధనలను తెలంగాణలో పూర్తిగా ఎత్తివేయలేదని వైద్యారోగ్య శాఖ లేవనెత్తింది. 

తెలంగాణలో మాస్క్ ధరించకపోతే రూ. వేయి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కరోనా ఫోర్త్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 20 నుంచి 25 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. మాస్క్, శానిటైజర్ వినియోగించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.  

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం!

Also Read: Pawan Kalyan visit : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అధికార ప్రకటన చేసిన జనసేన పార్టీ.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News