King Fisher Beers Sales: జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం విచిత్రమైన ఫిర్యాదు అందింది. జగిత్యాలలోని వైన్ షాపులలో కింగ్ ఫిషర్ బ్రాండ్‌కి చెందిన బీర్లు అమ్మడం లేదని.. వాటికి బదులుగా నాసిరకం బీర్లు, కల్తీ బీర్లు విక్రయిస్తూ మద్యం దుకాణాల యజమానులు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకస్తూ బీరం రాజేష్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఇదే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి మండలాల్లో కింగ్ ఫిషర్ బీరు విక్రయిస్తున్నప్పుడు.. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రం ఎందుకు విక్రయించడం లేదని నిలదీశారు.
మద్యం దుకాణదారులు అంతా కలిసి సిండికేట్‌గా ఏర్పడి కింగ్ ఫిషర్ బీర్లు అమ్మకుండా వాటి స్థానంలో నాసిరకం బీర్లు అమ్మడం వల్ల అవి తీసుకున్న వారు యూరిక్ యాసిడ్ సమస్యల బారినపడుతున్నారని రాజేష్ కలెక్టర్‌కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెల్టు షాపుల్లో నాసి రకం మద్యం విక్రయించడం వల్ల జనం యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతం అవుతున్నారని రాజేష్ కలెక్టర్‌కి విన్నవించారు. సిండికేట్ అయి కల్తీ మద్యం విక్రయిస్తూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ని కోరారు.
రాజేష్ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్.. ఎక్సయిజ్ సూపరింటెండెంట్‌ని పిలిచి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మకపోవడంపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన అనంతరం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ తాను చేసిన పని తాగుబోతు తరహాలో కనిపించవచ్చేమో కానీ.. నాసిరకం మద్యంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారనే ఆవేదనతోనే తాను ఈ ఫిర్యాదు చేసాను అని అన్నారు.
ఇది కూడా చదవండి : Young Boy Death: డ్యాన్స్ చేస్తూనే ఊపిరి వదిలాడు.. నవ్వుతూ తిరిగిరాని లోకాలకు.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook