Minister Srinivas Goud Case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమపై తప్పుడు కేసులు పెట్టారని మహబూబ్‌నగర్ జిల్లా కోర్టును నిందితులు ఆశ్రయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ గోనె సందీప్, ఏసీపీ భాస్కర్ గౌడ్, మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ కిషన్లతోపాటు మరో 18 మందిపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు..నిందితుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర చేశారన్న అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. నిందితులంతా బీజేపీ నేతకు సన్నిహితులు కావడంతో రాజకీయ రచ్చ కొనసాగింది. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. నిందితులను ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కొత్త మలుపు తిరిగింది. నిందితులంతా ప్రైవేట్ పిటిషన్ వేయడంతో ఈకేసు విచారణలో ఉత్కంఠ నెలకొంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook