హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గోల్కొండ కోట ప్రహరి గోడపైకి ఎక్కిన ఓ ప్రేమ జంట అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆ యువతి, యువకుడికి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పెద్దలు తమ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన కారణంగానే ఈ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన గోల్కోండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.