TS SSC Results 2024 Live: విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలు

TS 10th Results 2024 Live Updates: తెలంగాణ టెన్త్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు అధికారులు ఆన్‌లైన్‌లో వెల్లడించనున్నారు. పదో తరగతి ఫలితాలను https://results.bse.telangana/gov.in, https://results/bsetela, https://results.cgg.gov.in లింక్స్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2024, 12:23 PM IST
TS SSC Results 2024 Live: విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలు
Live Blog

TS Tenth Results Live Updates: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటీరికరణ అన్ని కంప్లీట్ కావడంతో అధికారులు ఆన్‌లైన్‌ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య  2,7,952 కాగా.. బాలికల సంఖ్య 2,50,433గా ఉంది. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షా పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

30 April, 2024

  • 12:23 PM

    Manabadi TS SSC 10th Results Live Updates: ఫెయిల్ అయిన విద్యార్థులు మే 16వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. తాము చదువుకున్న స్కూల్స్ హెడ్ మాస్టర్లకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

  • 11:44 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్క్స్‌ మెమోపై విద్యార్ధుల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ముద్రించనున్నట్టు అధికారులు వెల్లడించారు. 
     

  • 11:41 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: మార్కులపై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీ వాల్యూయేషన్ కోసం 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. 
     

  • 11:38 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: తెలంగాణ టెన్త్ పరీక్షలకు 5,05,813 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇందులో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా.. మరో 11,606 మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు.

  • 11:35 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
     

  • 11:23 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: టెన్త్ ఫలితాల్లో గతేడాది కంటే పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం వెల్లడించారు.

  • 11:19 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: పదో తరగతి ఫలితాల్లో బాలురులో 89.41 శాతం, బాలికలు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్ 100 శాతం ఫలితాలు రాగా.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయి. 99.06 శాతంతో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్‌లో నిలవగా.. 66 శాతం ఫలితాలతో వికారాబాద్‌ చివరి ప్లేస్‌లో నిలిచింది.

  • 11:17 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: టెన్త్ రిజల్ట్స్‌తో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. ఫెయిల్ అయినవారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరూ క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు.

  • 11:07 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: 8,883 మంది విద్యార్థులు 10కు 10 GPA సాధించినట్లు  బోర్డు కార్యదర్శి తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు  ఉదయం 9.30 నుంచి 12.30వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

  • 11:06 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: తెలంగాణ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 91.31 శాతం నమోదైంది.

  • 10:59 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: విద్యార్థులు పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు.. విద్యార్థులు ఆందోళన చెందకూడదు. 
     

  • 10:42 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: గతేడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు 4,84,370 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,19,460 మంది ఉత్తీర్ణులయ్యారు. 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
     

  • 10:39 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: మరికొన్ని నిమిషాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. విద్యార్థులు తమ మార్కులను bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

  • 10:20 AM

    Manabadi TS SSC 10th Results Live Updates: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.

    ==> అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి– https://results.bse.telangana/gov.in
    ==> టెన్త్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
    ==> హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయండి 
    ==> సబ్మిట్ చేయగానే.. మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. 

  • 10:13 AM

    Telangana 10th Results 2024 Live Updates: మార్కుల ప్రకారం గ్రేడ్స్ ఇలా.. 

    ==> గ్రేడ్ A- 75 శాతం కంటే ఎక్కువ
     
    ==> గ్రేడ్ B - 60 నుంచి 75 శాతం

    ==> గ్రేడ్ C- 50 నుంచి 60 శాతం

    ==> గ్రేడ్ D- 35 నుంచి 50 శాతం

  • 09:15 AM

    Telangana 10th Results 2024 Live Updates: గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగియగా.. ఫలితాలను మే 10వ తేదీన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందే పరీక్షలు పూర్తయ్యాయి. 
     

Trending News